Nuclear Power Plant
Nuclear Power Plant : దేశంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. గుజరాత్‌లోని కక్రాపర్‌లో భారత్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి 700 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కక్రాపర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ (కెఎపిపి)లోని రియాక్టర్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. (First India Made Nuclear Power Plant) భారతదేశం అణు విద్యుత్ రంగంలో మరో మైలురాయిని సాధించింది.
IAF Trishul exercise : పాక్, చైనా సరిహద్దుల్లో ఐఏఎఫ్ త్రిశూల్ విన్యాసాలు
‘‘గుజరాత్‌లోని మొట్టమొదటి అతిపెద్ద స్వదేశీ 700 మెగావాట్ల కక్రాపర్ అణు విద్యుత్ ప్లాంట్ యూనిట్-3 పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించింది. మా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు అభినందనలు’’ అని మోదీ గతంలో ట్విట్టర్‌గా పిలిచే ఎక్స్ లో పేర్కొన్నారు. (Nuclear Power Plant Starts Operations) ఎన్‌పీసీఐఎల్ దేశవ్యాప్తంగా 16 700 మెగావాట్ పవరుతో అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలని యోచిస్తోంది. దీని కోసం కేంద్రం ఆర్థిక, పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది.
Cricket World Cup 2023 : క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లకు టికెట్ల విక్రయం నేడు
రాజస్థాన్‌లోని రావత్‌భటా , హర్యానాలోని గోరఖ్‌పూర్‌లో అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. హర్యానాలోని గోరఖ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని చుట్కా, రాజస్థాన్‌లోని మహి బన్స్వారా, కర్ణాటకలోని కైగా అనే నాలుగు ప్రదేశాలలో ఫ్లీట్ మోడ్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన 10 పీహెచ్ డబ్ల్యూఆర్ భవనాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.