Flash floods : సిక్కింలో మెరుపు వరదలు…23 మంది జవాన్ల గల్లంతు

ఉత్తర సిక్కింలో బుధవారం క్లౌడ్ బరస్ట్ వల్ల మెరుపు వరదలు సంభవించాయి. మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ ఆకస్మిక వరదలు సంభవించడంతో పలు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద నీటిలో 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయారు....

Sikkim Flash floods

Flash floods : ఉత్తర సిక్కింలో బుధవారం క్లౌడ్ బరస్ట్ వల్ల మెరుపు వరదలు సంభవించాయి. మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ ఆకస్మిక వరదలు సంభవించడంతో పలు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద నీటిలో 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయారు. దీంతో సైనికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ వల్ల వరదలు వెల్లువెత్తాయి. తీస్తా నదిలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయి.

Also Read : Asian Games 2023: ఆర్చరీ క్రీడలో జ్యోతి సురేఖ, ఓజాస్ డియోటాలకు స్వర్ణ పతకం

చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరదల వలల లాచెన్ లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థావరాలకు కూడా భారీ నష్టం జరిగింది. నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది.

Also Read : Delhi liquor policy case : ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ తనిఖీలు

పశ్చిమ బెంగాల్‌- సిక్కింను కలిపే జాతీయ రహదారి 10లోని పలు భాగాలు కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదల నేపథ్యంలో చాలా రోడ్లు మూసివేశారు. సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో బుధవారం హై అలర్ట్ ప్రకటించింది. తీస్తా నదికి దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్ గురి పరిపాలన అధికారులు ముందుజాగ్రత్త చర్యగా నది దిగువ పరివాహక ప్రాంతం నుంచి ప్రజలను తరలించడం ప్రారంభించారు.

Also Read : Trinamool leaders : ఢిల్లీలో నిరసన తెలుపుతున్న తృణమూల్ నేతల నిర్బంధం

ఈ ఏడాది జూన్‌లో ఉత్తర సిక్కిం జిల్లా భారీ రుతుపవన వర్షాల కారణంగా భారీ వరదలను ఎదుర్కొంది. పెగాంగ్ ప్రాంతంలో వరదలు తీవ్రంగా వచ్చాయి. తీవ్ర వర్షపాతం కారణంగా సమీపంలోని నదులు పొంగిపొర్లడం వల్ల లాచెన్, లాచుంగ్ వంటి ప్రాంతాలు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఆకస్మిక వరదల కారణంగా 2,400 మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.

ట్రెండింగ్ వార్తలు