Delhi liquor policy case : ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ తనిఖీలు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు. అంతకుముందు ఈ కేసులో ఎంపీ సంజయ్ కు సన్నిహితంగా ఉన్న మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి....

Delhi liquor policy case : ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ తనిఖీలు

AAP MP Sanjay Singh

Delhi liquor policy case : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు. అంతకుముందు ఈ కేసులో ఎంపీ సంజయ్ కు సన్నిహితంగా ఉన్న మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో నిందితుడిగా పేర్కొన్న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్ అరోరా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిశారు.

Also Read : Building Collapsed : మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన భవనం…ఒకరి మృతి

తాను ఒక కార్యక్రమంలో సంజయ్ సింగ్‌ను కలిశానని, ఆ తర్వాత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కూడా సంప్రదింపులు జరిపినట్లు అరోరా ఈడీకి తెలిపారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు నిధుల సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దినోష్ అరోరా మొదట సంజయ్ సింగ్ ను కలిశారు. ఎంపీ ద్వారా అన్‌ప్లగ్డ్ కోర్ట్‌యార్డ్‌లో పార్టీలో మనీష్ సిసోడియా కలుసుకున్నాడని ఈడీ అధికారులు చెప్పారు.

Also Read : Trinamool leaders : ఢిల్లీలో నిరసన తెలుపుతున్న తృణమూల్ నేతల నిర్బంధం

ఎంపీ సంజయ్ సింగ్ అభ్యర్థన మేర దినేష్ అరోరా ఢిల్లీలో పార్టీ నిధుల సేకరణ కోసం రెస్టారెంట్ల యజమానులు రూ. 32 లక్షల చెక్కులను సిసోడియాకు అప్పగించారని ఈడీ పేర్కొంది. లిక్కర్ డిపార్ట్‌మెంట్‌తో దినేష్ అరోరాకు ఉన్న దీర్ఘకాలిక సమస్యను ఎంపీ సంజయ్ సింగ్ పరిష్కరించారని ఈడీ ఆరోపించింది.

Also Read : Bus Accident : ఇటలీలో ఘోర బస్సు ప్రమాదం…21 మంది మృతి

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అప్రూవర్‌గా మారేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్ మాగుంట, దినేష్ అరోరాలను మంగళవారం ఢిల్లీ కోర్టు అనుమతించింది. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేయడంతో మద్యం పాలసీని రద్దు చేశారు.