కట్నంకోసం భార్యను వేధిస్తున్న Flipkart కో ఫౌండర్..మరదలిపైనా లైంగిక వేధింపులు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడిగా పేరు ప్రఖ్యాతలు..వందల కోట్లు గడించిన సచిన్ బన్సల్ పేరు మారుమోగిపోతుంటుంది. సచిన్ బన్సల్ అంటే ఒక ఇన్పిరేషన్‌గా భావించేవారు. కానీ అతను కూడా ఓ సాధారణ వ్యక్తిలా..భార్యను అధిక కట్నం కోసం వేధిస్తున్నట్లుగా కేసు నమోదు కావటంతో అంత గొప్ప వ్యక్తికి ఇంత దిగజారుడు బుద్ధి ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
సచిన బన్సల్ అంటే ఒక స్ఫూర్తి దాయకమైన వ్యక్తిగా కీర్తించబడేవాడు. వందల కోట్లు గడించినా..అంత గొప్పస్థాయికి చేరుకున్నా..భార్యను అధిక కట్నం కోసం వేధించే వ్యక్తిత్వం లేని మనిషిగా ఇప్పుడంతా ఛీ కొడుతున్నారు. పెద్ద వ్యక్తికి ఇంత అల్ప బుద్ధేంటీ అంటున్నారు.
ఫ్లిప్ కార్ట్ ఐడియా, దాన్ని అమల్లో పెట్టడం, దాని మీద అందరి చూపూ పడేలా చేయడం, చివరకు దాని మార్కెట్ క్యాప్ ను వేల కోట్ల రూపాయలకు పెంచడం.. ఇవన్నీ సచిన్ బన్సల్ విజయగాథలు. ఇలా అతని తెలివితేటల గురించి ఎన్నో చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాలను కొన్ని వందల కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్టుగా ఉన్నారు దాని ఫౌండర్లు. అలా చూస్తే.. సచిన్ బన్సల్ కూడా వందల కోట్లకు అధిపతే!
వివరాల్లోకి వెళితే..సచిన్ బన్సల్ పై బెంగళూరు కోరమంగళ మాడివాలా పోలిస్ స్టేషన్లో ఆయన భార్య ప్రియ కేసు పెట్టారు. తనను అధిక వరకట్నం కోసం బన్సల్ వేధిస్తున్నారంటూ కంప్లైంట్ ఇచ్చారు ప్రియ. 2008లో జరిగిన తమ పెళ్ళి సమయంలో నా తండ్రి 11 లక్షల రూపాయల నగదును కట్నంగా ఇచ్చాడనీ..పెళ్లికి మరో రూ. 50 లక్షలు ఖర్చు పెట్టి అంగరంగ వైభోగంగా పెళ్లి చేశారనీ..అయినా సచిన్ బన్సల్ కు సంతృప్తి చెందలేదని..తనకు గత కొంతకాలంగా అధిక కట్నం కోసం వేధిస్తున్నాడనీ భార్య ప్రియ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.
అంతేకాదు..తన పేరున ఉన్న ఆస్తుల్ని తన భర్త సచిన బన్సల్ పేరున రాసివ్వాలని తనపై ఒత్తిడి చేస్తున్నాడని..దానికి తాను అంగీకరించకపోవటంతో తనను..తన పుట్టింటివారిని వేధిస్తున్నారనీ..అశ్లీలమైన మాటలతో మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడనీ ఆమె కంప్లైంట్ లో తెలిపింది. తన భర్తతో పాటు అత్త కిరణ్ బన్సాల్ మామ సత్య ప్రకాష్ అగర్వాల్ లు కూడా పెళ్లి జరిగినప్పటినుంచి తనను శారీరకంగా..మానసికంగా వేధిస్తున్నారనీ తెలిపారు ప్రియ.
అక్కడితో తన భర్త ఆగడాలు ఆగలేదనీ..నా సోదరి రాధిక గోయల్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆమెను తన భర్త లైంగికంగా వేధించేవాడని వాపోయారు ప్రియ. 2019 అక్టోబర్ 20న నాపై శారీరకంగా దాడి చేశాడని అధిక వరకట్నం కోసం వేధిస్తూ.. ఇప్పటికే తన పుట్టింటివారిని కూడా వేధిస్తూ మనశ్శాంతి లేకుండా వేధిస్తున్నాడని ప్రియా ఫిర్యాదులో పేర్కొంది.
ఫ్లిప్ కార్ట్ అధినేత సచిన్ బన్సల్ భార్య ప్రియ తన భర్తపై అధిక వరకట్నం వేధింపులు చేస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారని మాడివాలా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కారి బసవగౌడ తెలిపారు. ఫ్లిప్ కార్ట్ కు సంబంధించి అతడు అమ్మిన వాటాల విలువే వందల కోట్లు ఉంటాయి. అటువంటిది భార్యను ఆస్తుల కోసం..కట్నం కోసం వేధించడమా? దానిపై ఆమె పోలిస్ స్టేషన్ మెట్లు ఎక్కటమా! ఇదా కోట్లు ఉన్నా..నీ వక్ర బుద్ధీ..అంటున్నారు.
కాగా..2018లో ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్లిప్‌కార్ట్‌లో వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఫ్లిప్…ఫ్లిప్‌కార్ట్ నుంచి నిష్క్రమించిన సచిన్ బన్సాల్ తన వాటాను విక్రయించడం ద్వారా ఒక బిలియన్ డాలర్లను సొంతం చేసుకున్నారు. అనంతరం 450 మిలియన్ డాలర్లు పెట్టుబడులతో అంకిత్ అగర్వాల్‌తో కలిసి నవీ టెక్నాలజీస్ పేరుతో పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించాడు. దీంతోపాటు ఓలాలో 100 మిలియన్ల డాలర్లు పెట్టుబడులతో సహా , ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ అథెర్, ఇన్‌షార్ట్స్, గ్రే ఆరెంజ్, యునా అకాడమీ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. మరోవైపు ఈ ఆరోపణలపై సచిల్ బన్సాల్ ఇప్పటివరకు స్పందించలేదు.