Kitty Kumaramangalam Murder: మాజీ కేంద్రమంత్రి రంగరాజన్ కుమారమంగళమ్ భార్య హత్య..
జీ కేంద్రమంత్రి P. రంగరాజన్ కుమారమంగళమ్ భార్య కిట్టీ కుమారమంగళమ్ హత్యకు గురయ్యారు. మంగళవారం (జులై 6,2021) రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కిట్టీ కుమార మంగళం నివసిస్తున్న వసంత్ విహార్‌లోని ఆమె నివాసంలోనే హత్యకు గురయ్యారు.

Kitty Kumaramangalam Murder
Kitty Kumaramangalam Murder In Delhi: మాజీ కేంద్రమంత్రి P. రంగరాజన్ కుమారమంగళమ్ భార్య కిట్టీ కుమారమంగళమ్ హత్యకు గురయ్యారు. మంగళవారం (జులై 6,2021) రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కిట్టీ కుమార మంగళం నివసిస్తున్న వసంత్ విహార్‌లోని ఆమె నివాసంలోనే హత్యకు గురయ్యారు. ఈ కేసు గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 67 సంవత్సరాల వయస్సున్న కిట్టీ కుమరమంగళం హత్య వెనుక దోపిడీ ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య కేసులో కిట్టీ ఇంట్లో వాషర్‌మ్యాన్‌గా పనిచేస్తున్న వసంత్ విహార్‌లోని భన్వర్ సింగ్ క్యాంప్‌కు చెందిన 24 ఏళ్ల రాజు అనే యువకుడిని అరెస్ట్ చేశామని ఢిల్లీ సౌత్ వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఇంగిత్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. అతనే ఈ హత్య చేశాడని తెలిపారు.
దీనిపై కమిషనర్ మాట్లడుతూ..మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఎప్పటిలాగే ఆమె ఇంట్లో పనిచేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో కిట్టి మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాజు లోపలికి వెళ్లిన తర్వాత డోర్ పెట్టేసి, కిట్టీపై దాడి చేశాడు. ఆమెను గదిలో బంధించి కాళ్లు చేతులు కట్టేసి..మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రాజుకు సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
కిట్టీ హత్య గురించి తెలిసి ఘటనాస్థలానికి వెళ్లగా..వాషర్ మ్యాన్ గా పనిచేసే రాజునే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే అనుమానాలు వ్యక్తం అయ్యాయనీ..దీంతో వెంటనే కిట్టీ ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా..అక్కడ ఓ సూట్ కేసు ఓపెన్ చేసి ఉందని..కిట్టీ ఇంట్లో డబ్బు, నగలను దొంగతనం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నామని విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే మిగిలిన ఇద్దరు నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు.
కిట్టీ భర్త పీఆర్ కుమారమంగళం 1984లో తమిళనాడులోని సేలం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 1998 నుంచి 2000 వరకు తిరుచిరాపల్లి ఎంపీగా ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు కేబినెట్‌లో న్యాయశాఖమంత్రిగా సేవలందించారు. ఆ తరువాత మాజీ ప్రధాని వాజ్‌పేయీ ప్రభుత్వంలోకేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన 2000 ఆగస్టు 23న పీఆర్ కుమారమంగళం కన్నుమూశారు.