Oommen Chandy : స్టూడెంట్స్ యూనియన్ నుంచి సీఎం వరకు ఉమెన్ చాందీ రాజకీయ ప్రస్థానం..12 సార్లు ఎమ్మెల్యేగా విజయం

12 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత. ఐక్య రాజ్యసమితి నుంచి ప్రజాసేవకు అవార్డు పొందిని భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా పేరు.ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన రాజకీయ నేత కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ.

Oommen Chandy : స్టూడెంట్స్ యూనియన్ నుంచి సీఎం వరకు ఉమెన్ చాందీ రాజకీయ ప్రస్థానం..12 సార్లు ఎమ్మెల్యేగా విజయం

Oommen Chandy

Updated On : July 18, 2023 / 3:45 PM IST

Kerala Ex CM Oommen Chandy : కేరళ మాజీ ముఖ్యమంత్రి..కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ (Oommen Chandy )తన79 ఏట అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమెన్ చాందీ కేరళ శాసన సభలో ఎక్కువ కాలం పనిచేసిన ఎమ్మెల్యేగా..ఐక్యరాజ్యసమితి (United Nations)నుంచి ప్రజాసేవకు అవార్డు సాధించిన భారత్ లోనే ఏకైక ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ. అంతేకాదు  12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఊమెన్ చాందీ 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు.

విద్యాసంఘం నుంచి కేరళకు రెండుసార్లు సీఎంగా పనిచేశారు. సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. నిజాయతీ, నిబద్ధత గల వ్యక్తిత్వంతో పార్టీ అధిష్ఠానానికి సన్నిహితుడిగా మారారు. 1970లో ఊమెన్ చాందీ తనకు 27 ఏళ్ల వయసులో తొలిసారిగా పూతుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అది మొదలు ఆయన విజయయాత్ర అప్రతిహతంగా సాగింది. అదే నియోజకవర్గానికి ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. 1977లో కె.కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా చాందీకి మంత్రి పదవి దక్కింది. 2004-06, 2011-16 మధ్య కాలంలో ఆయనను సీఎం పీఠం దక్కింది.

Former Kerala Chief Minister : కేరళ మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ కన్నుమూత

చాందీ నాలుగు సార్లు మంత్రిగా పనిచేశారు. K. కరుణాకరన్ మంత్రిత్వ శాఖలో 11 ఏప్రిల్ 1977 నుండి 25 ఏప్రిల్ 1977 వరకు కార్మిక శాఖ మంత్రిగా 27 అక్టోబర్ 1978 వరకు అదే పోర్ట్‌ఫోలియోను కొనసాగించారు. రెండోసారి కె. కరుణాకరన్ మంత్రిత్వ శాఖలో 28 డిసెంబర్ 1981 నుండి 17 మార్చి 1982 వరకు. మళ్ళీ, అతను 2 జూలై 1991న నాల్గవ కె.కరుణాకరన్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆర్థిక శాఖకు బాధ్యత వహించి, మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు.

కేరళ అంటే కమ్యూనిస్టులకు అడ్డా. అటువంటి కేరళలో 12సార్లు ఎమ్మెల్యేగా గెలవటం రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉమెన్ చాందీ రాజకీయ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన విషయం అని చెప్పుకోవచ్చు.సీఎం స్థాయిలో ఉన్నా ఆయన సింపుల్ గా ఉండటం ఆయనకున్న మరో ప్రత్యేకత.1970, 1977, 1980, 1982, 1987, 1991, 1996, 2001, 2006, 2011, 2016,2021 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీటిలో ఎనిమిదిసార్లు కమ్యూనిస్టు నేతలపైనే గెలుపొందటం గమనించాల్సిన విషయం. 2004 నుండి 2006 వరకు మరోసారి 2011 నుండి 2016 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసారు.