Uttarakhand Landslide
Uttarakhand Landslide : ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. ఆగస్టు 22 నుంచి 24తేదీల వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో తాజాగా కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు. (Uttarakhand Landslide) ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టింది.
Luna-25 Moon Mission Crash : లూనా-25 క్రాష్ తర్వాత ఆసుపత్రిలో చేరిన రష్యా టాప్ సైంటిస్ట్
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలోని చంబాలో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మహిళలు, 4 నెలల శిశువుతో సహా నలుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశామని, గల్లంతైన మరొకరి కోసం గాలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి నవనీత్ సింగ్ భుల్లారైడ్ తెలిపారు. చంబా పోలీస్ స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్‌పై కొండచరియలు విరిగిపడటంతో మరికొన్ని వాహనాలు కూడా చిక్కుకుపోయే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Prime Minister Narendra Modi : బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోదీ
భారీ వర్షాల హెచ్చరికల మధ్య పాఠశాలలు మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీవర్షాలు కురుస్తున్నాయి. చంబా, నరేంద్ర నగర్ ,జౌన్‌పూర్‌లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం మూసివేశారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు.
PM Modi : రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి రాఖీ కట్టనున్న పాక్ సోదరి
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు సంభవించాయి. డెహ్రాడూన్, పౌరీ, నైనిటాల్, చంపావత్, బాగేశ్వర్ సహా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ మంగళవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. చంబా, మండీ జిల్లాల పరివాహక ప్రాంతాల్లో ఒక మోస్తరు వరదలు సంభవించే ప్రమాదం ఉంది. ఆగస్టు 26వతేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది.