PM Modi : రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి రాఖీ కట్టనున్న పాక్ సోదరి

రక్షాబంధన్ సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన కమర్ మొహిసిన్ షేక్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోదీకి గడచిన 30 ఏళ్లుగా రాఖీ కడుతున్న కమర్ మొహిసిన్ రక్షాబంధన్ సందర్భంగా ఈ నెల 30వతేదీన పాక్ నుంచి ఢిల్లీకి రానున్నారు....

PM Modi : రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి రాఖీ కట్టనున్న పాక్ సోదరి

Pak sister Raksha Bandhan

PM Modi : రక్షాబంధన్ సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన కమర్ మొహిసిన్ షేక్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోదీకి గడచిన 30 ఏళ్లుగా రాఖీ కడుతున్న కమర్ మొహిసిన్ రక్షాబంధన్ సందర్భంగా ఈ నెల 30వతేదీన పాక్ నుంచి ఢిల్లీకి రానున్నారు. (PM Modi’s Pakistani sister Qamar Mohsin Sheikh)

Chandrayaan-3 : ప్రతికూలంగా ఉంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్ వాయిదా…ఇస్రో శాస్త్రవేత్త వెల్లడి

‘‘నేను మోదీకి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతని ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం నేను ప్రతిరోజూ ప్రార్థిస్తున్నాను. నా కోరికలన్నీ నెరవేరుతాయని నేను నమ్ముతున్నాను. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించినప్పుడు, అతను అయ్యారు. ఎప్పుడు నేను రాఖీ కట్టినా, ఆయన ప్రధాని కావాలనే నా కోరికను వ్యక్తపర్చే దాన్ని, నా కోరికలన్నీ దేవుడు తీర్చాడు, దేశం కోసం మోదీ ప్రశంసనీయంగా పని చేస్తున్నారు’’ అని కమర్ మొహిసిన్ చెప్పారు. (tie him rakhi this Raksha Bandhan)

Coronavirus Cases : కొవిడ్ కేసుల వ్యాప్తిపై కేంద్రం అలర్ట్…పిరోలా, ఎరిస్ వేరియెంట్లపై రాష్ట్రాలు అప్రమత్తం

ప్రతి సంవత్సరం కమర్ ప్రధాని మోదీకి చేతితో తయారు చేసిన రాఖీలను కడతుంటారు. (Pak sister Raksha Bandhan) మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కమర్ వెళ్లి ఆయన చేతికి రాఖీ కట్టారు. కొవిడ్-19 సమయంలో తాను ప్రధాని మోదీకి (#NarendraMody) రాఖీ కట్టలేకపోయానని, అయితే, దాన్ని పోస్ట్ ద్వారా పంపానని కమర్ చెప్పారు. తన పెళ్లి అయిన తర్వాత గత 30 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నానని కమర్ వివరించారు. మొత్తం మీద పాక్ సోదరి 31 వసారి రాఖీ కట్టేందుకు పాక్ నుంచి ఢిల్లీకి రానుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.