Rgi Airport
RGI Airport : హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూన్ నెలలో 4 లక్షల మంది రాకపోకలు జరిపినట్లు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇంతమంది రాకపోకలు సాగించడంతో రికార్డుగా మారింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత నిబంధనల్లో సడలింపు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ విమానాశ్రయానికి ప్రయాణికులు పోటెత్తారు.
జూన్ నెల మొదట్లో రోజు పదివేల మంది ప్రయాణికులు వచ్చే వారు. జూన్ 20 తర్వాత కరోనా నిబంధలు ఎత్తేయడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. జూన్ 20 తర్వాత ప్రతి రోజు 20 వేలమంది ప్రయాణం చేసినట్లు జీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వ్యాపారం నిమిత్తం వెళ్లే వారు, విహారయాత్రకు వెళ్లేవారు.. విదేశీ ప్రయాణికులు ప్రతి రోజు వేలలో ప్రయాణించేవారని తెలిపారు.
ప్రయాణికులు కరోనా నిబంధనకు మర్చిపోకుండా విమానాశ్రయ సిబ్బంది పదే పదే గుర్తు చేసేవారని తెలియచేశారు. డబుల్ మాస్క్ తప్పనిసరి చేశామని, ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నవారినే అనుమతిచ్చినట్లు తెలిపారు. ఇక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రజలకు కరోనా పట్ల అవహగానా కల్పించారు. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్ పోర్ట్ లోనే ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేసి పరీక్షలు చేశారు. ఆలా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేశారు.