Frog Wedding : బాజా భజంత్రీలతో కప్పలకు ఘనంగా పెళ్లి

ఆదివాసీలు అంతా కలిసి కప్పలకు ఘనంగా పెళ్లి చేశారు. మంగళవాయిద్యాలతో అంగరంగ వైభోగంగా కప్పలకు పెళ్లి చేశారు. ఎందుకంటే..

Frog Wedding : బాజా భజంత్రీలతో కప్పలకు ఘనంగా పెళ్లి

Frog Wedding (1)

Updated On : August 16, 2021 / 2:26 PM IST

Frog Wedding To Please Rain God : వర్షాలు మెండుగా కురవాలని కప్పకు పెళ్లి చేస్తారనే విషయం తెలిసిందే. ఈక్రమంలో వర్షాకాలం వచ్చి ఇంత కాలం అయినా వర్షాలు కురవటంలేదని ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లాలోని ఉమ్మర్‌కోట్‌ సమితి కొరమరి గ్రామంలో కప్పలకు పెళ్లి చేశారు స్థానికులు. మేళ తాళాలతో..మంగళ వాయిద్యాలతో కప్పలకు పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన తరువాత గ్రామస్తులంతా తమ సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేశారు.

కొరమరి గ్రామంలో ఆదివాసీలు నివసిస్తుంటారు. వీరంతా పురాతన ఆచారాలను పాటిస్తుంటారు. సంప్రదాయాలను వదులుకోవటానికి ఆదివాసీలు అస్సలు ఇష్టపడరు. ఆదివాసీలంతా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా బతుకుతారు. వ్యవసాయం చేయాలంటే వర్షాలు కురవాలి. నీరు పొంగి పొర్లాలి.కానీ వర్షాకాలం వచ్చింది.ఖరీఫ్‌ సీజన్‌ వచ్చింది. కానీ వర్షాలు మాత్రం తగినంతగా కురవటంలేదు. దీంతో ఆదివాసీలంతా వర్షాలు కురవాలని ప్రార్థిస్తు కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. ప్రధానంగా శ్రావణమాసంలో వరుణ దేవుడిని మెప్పించి, వర్షం కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. అలా అచ్చు మనుషులకు పెళ్లి చేయటానికి ఎంత ఆర్భాటం చేస్తారో ఈ కప్పల పెళ్లి కోసం కూడా అంతే ఆర్భాటం చేశారు ఆదివాసీలు.

ఈ పెళ్లి వేడుకలు భాగంగా ఆదివాసీలంతా వ్యవసాయ దేవతలైన బీమ, బీమానిలకు నవదిన పూజలు చేస్తారు. ఆ తర్వాత పెళ్లికి కప్పల కోసం గాలిస్తారు. ఈ క్రమంలో రెండు ఆడకప్పలకు..రెండు మగకప్పలతో పెళ్లి చేయటానికి ఆడ కప్పలను మండపానికి తీసుకువచ్చి, పెద్దల సమక్షంలో సంప్రదాయ రీతిలో వాటికి పెళ్లి చేస్తారు. ఈ కార్యక్రమం తరువాత విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్థానికుల నమ్ముతారు. ఈ సంప్రదాయం తరతరాల నుంచి కొనసాగుతూ వస్తోందని గ్రామస్తుడు రామనాథ్‌ పూజారి తెలిపారు.