PM Kisan Tractor Scheme :రైతులు 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్ కొనుక్కోవచ్చు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? స్కీమ్ పూర్తి వివరాలు..

కేంద్రం ప్రభుత్వం రైతులకు సగం ధరకే ట్రాక్టర్లను అందించే స్కీమును ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద.. ట్రాక్టర్ల కొనుగోలుపై 50శాలం సబ్సిడీతో ట్రాక్టర్లు కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది.

PM Kisan Tractor Scheme :రైతులు 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్ కొనుక్కోవచ్చు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? స్కీమ్ పూర్తి వివరాలు..

PM Kisan Tractor Scheme

Subsidy on Tractor: రైతే దేశానికి వెన్నెముక అంటారు. అటువంటి రైతన్న ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన విలవిల్లాడుతున్నాడు. పెట్టుబడులు పెగుతున్నాయి. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరల లేక పండించిన పంట ఏంచేయసుకోవాలో తెలియక మరోసారి పంట వేయటానికి చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నాడు. ఖర్చులు పెరగటంతో వ్యవసాయం భారంగా మారుతోందని గుర్తించిన ప్రధాని నరేంద్రమోడీ రైతన్నల కోసం ఓ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా సబ్సిడీపై ట్రాక్టర్లను అందించేలా స్కీమ్ తీసుకొచ్చింది.

ట్రాక్టర్ ఉంటే రైతుకు చాలా మేలు జరుగుతుంది. కానీ ప్రస్తుతం ట్రాక్టర్ ల ధరలు కొనేలా లేవు. దీంతో కేంద్రం ప్రభుత్వం రైతులకు సగం ధరకే ట్రాక్టర్లను అందించే స్కీమును ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద.. ట్రాక్టర్ల కొనుగోలుపై 50శాలం సబ్సిడీతో ట్రాక్టర్లు కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది. రైతు ఈ స్కీమ్ కింద ట్రాక్టర్‌ను కొనుగోలు చేస్తే.. వారు స్కీమ్ అందిస్తున్న ప్రయోజనాలను పొందవచ్చు. అంటే సగం డబ్బు ఆదా అవుతుంది.

ఎవరు అర్హులు..
భార‌త‌దేశంలో ఉండే ప్ర‌తి స‌న్న‌కారు, చిన్న‌కారు రైతు ఈ ప‌థ‌కానికి అర్హుడే. సొంత పొలం ఉన్న రైతుల‌కు, కౌలు రైతుల‌కు కూడా ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. కౌలు రైతులు పొలం య‌జ‌మాని నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాక్టర్ కొనుక్కోవాలనుకునే రైతులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అందించే 50శఆతం సబ్సిడీ ఆ రైతు ఖాతాలో జమచేస్తుంది. దీని కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైతు సోదరులు తమ సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

సబ్సిటీ రూల్స్..
సబ్సిడీ పొందటానికి ముఖ్యమైన షరతు ఏమిటంటే.. ట్రాక్టర్ కొనుగోలు చేయాలనుకునే సదరు రైతు గత ఏడేళ్లలో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఉండకూడదు. రైతుకు భూమి ఉండాలి. ఆ భూమి ఆ రైతు పేరుమీదనే ఉండాలి. ఒక రైతు ఒక ట్రాక్టర్‌పై మాత్రమే సబ్సిడీ పొందేందుకు అర్హుడుగా ఉంటాడు. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్ కొనుగోలు చేసే రైతుకు ఏ సబ్సిడీ పథకం ఉండి ఉండకూడదు. అలాగే ఆ రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ సబ్సిడీ స్కీమ్ వర్తిస్తుంది. సదరు రైతు వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాల నుంచి 60 సంవ‌త్స‌రాల్లోపు ఉండాలి. ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షికాదాయం రూ.1.50 ల‌క్ష‌ల‌కు దాట‌కూడ‌దు.

అవసరమైన డాక్యుమెంట్లు..
స్కీమ్ కింద సబ్సిడీ పొందాలనుకునే రైతు ఆధార్ కార్డు, తన పేరుమీద ఉన్న భూమి డాక్యుమెంట్స్ తో పాటు ఓటరు ID కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌ వంటి గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అతనికి ఎకౌంట్ ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, మెుబైల్ నంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అందజేయాలి..

దరఖాస్తు ఎలా..
సాధారణంగా ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే రైతు తాను ఉన్న గ్రామ స‌చివాల‌యం, రైతు భ‌రోసా కేంద్రాల్లోని అధికారుల‌ను సంప్ర‌దించాలి.
తెలంగాణలో కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ (మీసేవా కేంద్రాల‌) ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు..
రైతు త‌న‌కు ఇష్టమొచ్చిన ట్రాక్ట‌ర్, త‌న‌కు ఇష్టమైన ధ‌ర‌లో, ఇష్ట‌మైన కంపెనీ ట్రాక్ట‌ర్ కొనుక్కోవ‌చ్చు. త‌న అవ‌స‌రాల‌కు త‌గ్ట‌ట్లు ఏ ట్రాక్ట‌ర్ కొనాల‌నేది రైతు ఇష్టం.

ఆన్‌లైన్‌లో ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?
కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..

దీనికోసం ముందుగా లాగ్‌ఇన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్నాక దరఖాస్తు విండో ఓపెన్ అవుతుంది..
రైతుల కోసం పీఎం కిసాన్ వెబ్‌సైటులో ప్ర‌త్యేకించి హెల్ప్‌లైన్ ఉంటుంది.

అనుమానాలు ఉంటే ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు..ఫోన్ నం : 155261 / 011-24300606

మరిన్ని వివరాలకు మీకు ద‌గ్గ‌ర్లోని వ్య‌వ‌సాయ‌శాఖాధికారిని సంప్ర‌దించ‌గలరు..