అహింసే ఆయుధం: మహాత్ముడిగా గాంధీజీ

భారత జాతిపిత మహాత్మా గాంధీ. మంచి పనులు చేసిన వారిని మహాత్ములంటాం. కానీ బ్రిటీష్ బానిస సంకెళ్లనుంచి భరతమాతన విముక్తి చేసిన గాంధీజీ భారతదేశానికి మహాత్ముడయ్యాడు. ఒక్క భారతే కాదు ప్రపంచ దేశాలన్ని గాంధీజీని మహాత్ముడిగా పిలుస్తున్నాయి. దానికి అతను చేసిన త్యాగాలే నిదర్శనం. దేశం కోసం గాంధీజీ తన ప్రాణాల్నే పణ్ణంగా పెట్టారు. దేశం కోసం పోరాడే క్రమంలో బ్రిటీష్ వారు భారతీయుల్లో పుట్టించిన వివక్షా భావాజాలలపై కూడా గాంధీ పోరాడేవారు.
సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని తన అహింసాయుధంతో గడగడలాండించిన ఘనత భారత జాతిపిత గాంధీజీది. ఈ మహాత్ముడికి తెలిసిందే ఒక్కటే. ఎక్కడ వివక్ష ఉన్నా..దానికి వ్యతిరేకంగా పోరాడటం. సత్యం, అహింసల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని మహా మనీషి మహాత్మా గాంధీజీ. చినుకు చినుకు గాలివానగా మారినట్లుగా స్వాతంత్ర్యం కోసం గాంధీ వేసిన ఒక్కో అడుగు బ్రిటిష్ సామ్రాజ్యవాద కోటలను బీటలు వారేలా చేసింది.
గాంధీజీ ఇచ్చిన పిలుపుతో కుటుంబాలను..చదువులను,ఉద్యోగాలనే కాదు..కట్టుకున్నవారిని, కన్నబిడ్డలను కూడా వదిలేసి వచ్చిన భారతీయులు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఇదంతా కేవలం ఒక్క గాంధీజీ పిలుపుతోనే సాధ్యమైంది.
గాంధీజీకి రాజకీయ గురువు గోపాల కృష్ణ గోఖలే. ఆయనే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశారు.ఆయన స్ఫూర్తితోనే గాంధీజీ భారతదేశ స్వాంతంత్రోద్యమంలో అడుగుపెట్టాడు. ఈక్రమంలోనే సర్ధార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీకి కుడి భుజంగా నిలిచారు. పటేల్ డేరింగ్,గాంధీజీ ఆలోచనలతో పలు ప్రణాళికల్ని రూపొందించేవారు. 1918లో చంపారన్, ఖేడా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. గాంధీజీ నాయకత్వంలో వేలాదిమంది ప్రజలు బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడి , జైళ్లకు సైతం వెళ్లారు.
భారత స్వతంత్ర్య పోరాటంతో ప్రజలు బాపూ అని మహాత్మా అని గౌరవంగా పిలిచేవారు.ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్ ఉదంతం గాంధీజీలో స్వరాజ్య కాంక్షను మరింత రగిల్చింది. అహింసా, సహాయ నిరాకరణ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు గాంధీజీ. స్వరాజ్య ఉద్యమానికి నాయకత్వం వహించారు గాంధీ. ఈ ఉద్యమంలో మహిళలు భారీ ఎత్తున భాగస్వామ్యమయ్యారు.
స్వాతంత్ర్య పోరాటంలో ఉప్పు సత్యాగ్రహాం కీలక పాత్ర వహించింది. 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహానికి గాంధీజీ శ్రీకారం చుట్టారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైనపాత్ర వహించాయి. ఇవే ఉద్యమాలకు చివరి ఘట్టాలని చెప్పుకోవచ్చు. ఈక్రమంలోనే 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలకుల నుంచి భారతదేశానికి స్వాంతంత్య్రం లభించింది. అహింసా మార్గంలో లక్షలాది మందిని కదిలించి, దేశానికి స్వాంతంత్య్రం తీసుకొచ్చారు గాంధీజీ.. గాంధీజీ మరణించి ఏడు దశాబ్దాలు గడిచినా.. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం అంటే అందరికీ చిన్నపిల్లలకైనా ముందుగా గుర్తుకొచ్చేది గాంధీజీనే. అప్పటికీ ఇప్పటీకే ఎప్పటికీ గాంధీజీ మహాత్ముడే…భారత జాతి పిత మహాత్మా గాంధీజీనే. భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సిద్ధంచటంటో కీలక పాత్ర వహించిన గాంధీజీ 150 జయంతి అక్టోబర్ 2 2019న ఘనం నిర్వహించుకునేందుకు యావద్భారతం సిద్ధమయ్యింది.