PK Meets Rahul Gandhi: రాహుల్ గాంధీని కలిసిన ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం కలిశారు. ప్రశాంత్ కిషోర్, రాహుల్ గాంధీ సమావేశం ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో జరిగింది.

PK Meets Rahul Gandhi: రాహుల్ గాంధీని కలిసిన ప్రశాంత్ కిషోర్

Pk Meets Rahul Gandhi

Updated On : July 13, 2021 / 5:11 PM IST

PK Meets Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం కలిశారు. ప్రశాంత్ కిషోర్, రాహుల్ గాంధీ సమావేశం ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో జరిగింది. కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్దూ ట్వీట్ తర్వాత ఈ సమావేశం జరిగినట్లుగా బయటకు వచ్చింది.

మార్చి 2017లో పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన పంజాబ్ కాంగ్రెస్ నవజోత్ సింగ్ సిద్ధు.. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈసారి సిద్దూనే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబోతున్నట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 2017ఎన్నికల్లో 117 స్థానాల్లో 77 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. కెప్టెన్ అమరీందర్ ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే, అప్పుడు సిద్ధును డిప్యూటీ సిఎంగా చేయాలనే చర్చ పూర్తి స్థాయిలో జరిగింది. అయితే, అలా జరగలేదు.. దీంతో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సిద్ధూ మధ్య గొడవలు మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఈ క్రమంలోనే నవజోత్ సింగ్ సిద్దూ “మా ప్రతిపక్ష పార్టీ ఆమ్ ఆద్మీ ఎల్లప్పుడూ పంజాబ్ కోసం మేం చేస్తున్న పనిని గుర్తించింది. 2017కి ముందు, పంజాబ్ మాదకద్రవ్యాలు, రైతుల సమస్యలు, అవినీతి మరియు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. కానీ, ఇప్పుడు అభివృద్ధి చెందిన పంజాబ్ రాష్ట్రాన్ని దేశమంతా చూస్తోందని, పంజాబ్ కోసం నిజంగా ఎవరు పోరాడుతున్నారో ఆప్‌కు కూడా తెలుసని ట్వీట్ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భగవంత్ మన్ కూడా సిద్దును ట్వీట్ ద్వారా ప్రశంసించారు. సిద్ధూ ఈ వీడియోను షేర్ చేసిన తరువాత, కాంగ్రెస్‌లో ప్రకంపనలు నెలకొన్నాయి. సిద్దూ సోషల్ మీడియా ద్వారా పార్టీలో నిరంతరం గందరగోళ పరిస్థితిని కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ మాజీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో సుదీర్ఘ సమావేశాలు జరిపారు.

ఈ సమావేశాలలో, పార్టీలో లేదా సంస్థలో గౌరవప్రదమైన పదవిని ఇచ్చే ప్రతిపాదనతో సిద్దుని ఒప్పించే ప్రయత్నం కాంగ్రెస్ హైకమాండ్ చేసిందని చెప్పుకుంటున్నారు. ఆ మీటింగ్ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి సపోర్ట్‌గా సిద్ధూ ట్వీట్ చెయ్యడంతో సిద్ధూకి, అమరిందర్‌కు మధ్య సయోధ్యకే ఈ మీటింగ్ జరిగినట్లుగా చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ప్రశాంత్ కిషోర్ 2017 ఎన్నికల సమయంలో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా వ్యూహకర్తగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకుని రావడంతో కీలకపాత్ర పోషించారు.