Viral Videos: దేశ వ్యాప్తంగా సందడే సందడి.. గణేశుడి నిమజ్జనం వేళ దుమ్ముదులిపేసిన భక్తులు, సెలబ్రిటీలు

గణేశ్‌ నిమజ్జనంలో ప్రజలతో పోటీగా పోలీసులు స్టెప్పులతో అదరగొట్టేశారు.

Ganesh nimajjanam Viral Videos 2023

Ganesh nimajjanam: గణేశుడి విగ్రహాల నిమజ్జనాల్లో దేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. డ్యాన్సులు చేస్తూ, రంగులు చల్లుకుంటూ, ప్రసాదాలు పంచుతూ సందడి సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ సాక్షిగా పోలీసులు కూడా డ్యాన్సు చేస్తూ దుమ్ము రేపారు.

గణేశ్‌ నిమజ్జనంలో ప్రజలతో పోటీగా పోలీసులు స్టెప్పులతో కుమ్మేశారు. వారి సందడి చూసి జనం.. ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. హైదరాబాద్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గణేశుడి విగ్రహాల నిమజ్జనాల్లో భక్తులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వినాయక శోభాయాత్ర జరిగిన రోడ్లు గణేశ్ నామస్మరణతో మార్మోగిపోయాయి.

బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం గణేశుడి విగ్రహాల నిమజ్జనాల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఈ సందడిని చూడడానికి రెండు కళ్లూ చాలడం లేదు. మీరూ చూడండి..

Ganesh Laddu Auction: వేలంలో రూ. కోటికిపైగా పలికిన గణేశ్ లడ్డూ.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?