చావుతో చెలగాటం.. అయినా వదల్లేదు : కారు బానెట్ పై 2కి.మీ వెళ్లాడు

చావుతో చెలగాటం.. అయినా వదల్లేదు : కారు బానెట్ పై 2కి.మీ వెళ్లాడు

Updated On : March 7, 2019 / 8:02 AM IST

కారు ఆపమని చెబుతున్నా వినకుండా.. సెక్యూరిటీ గార్డును కారు ఈడ్చుకెళ్లింది. పొరపాటుగానో.. టెక్నికల్ లోపంతోనో జరిగింది కాదు. కచ్చితంగా డ్రైవర్ బాబు పొగరే దీనికి కారణం. సెక్యూరిటీ వ్యక్తి ఆపమని వారిస్తున్నప్పటికీ ఆగకుండా దాదాపు 2 కి.మీల వరకూ కారును పోనిస్తూనే ఉన్నాడు. డ్రైవర్ వేగానికి ఏ మాత్రం వెనుకడుగేయని సెక్యూరిటీ గార్డు వదలకుండా అలాగే పట్టుకుని చివరి వరకూ ప్రయాణించాడు. చుట్టుపక్కల వారు.. తోటి వాహనదారులు కారును ఆపే ప్రయత్నం చేయడంతో ఎలాగైతే కారు ఆగింది.
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్ బోనెట్ ప్రయాణిస్తున్న వ్యక్తి చివరకు కారును ఆపగలిగాడు.కారును ఆపకుండా పోనిచ్చేందుకు ముందు వ్యక్తిని కింద పడేయాలని డ్రైవర్ జిగ్ జాగ్‌గా కారును అటుఇటూ తిప్పినా పట్టు వదలకుండా అలాగే ఉన్నాడు. ఆ తర్వాత రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు కార్ డ్రైవర్‌కు చివాట్లు పెట్టి డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు. 

వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ సెక్యూరిటీ వ్యక్తి ఒక కాలి చెప్పుతో కారు ఆపేందుకు ప్రయత్నిస్తున్న వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. కొద్ది నెలల క్రితం హర్యానాలోని గుర్‌గావ్‌లో హ్యుండాయ్ వెర్నా ఆపేందుకు వైపర్ పట్టుకుని పోలీస్ కానిస్టేబుల్ ప్రయత్నించిన ఘటన ఇలాగే వైరల్ అయింది.

Also Read : చావుతో చెలగాటం.. అయినా వదల్లేదు : కారు బానెట్ పై 2కి.మీ వెళ్లాడు