Global Hunger : ఆకలి మంటలు..భారత్ 101, అప్ఘాన్ 103 ప్లేస్

దేశంలో ఆహార నిల్వలు భారీగానే ఉన్నప్పటికీ పోషకాహార లోపాలు చిన్నారులనూ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 101వ స్థానంలో నిలిచింది.

Global Hunger India : దేశ పౌరులందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఫలితాలనివ్వటంలేదని ప్రపంచ ఆకలి సూచీ-GHI స్పష్టం చేస్తోంది. దేశంలో ఆహార నిల్వలు భారీగానే ఉన్నప్పటికీ పోషకాహార లోపాలు చిన్నారులనూ వెంటాడుతూనే ఉన్నాయి. 116 దేశాల జాబితాతో వెలువడిన ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 101వ స్థానంలో నిలిచింది.

Read More : Maoist RK : ఆర్కే మృతిపై ప్రకటన విడుదల చేయని మావోయిస్టు కేంద్ర కమిటీ!

ఇది గతేడాది కంటే తక్కువ ర్యాంక్‌. 2020లో 94స్థానంలో నిలిచిన భారత్‌ ఇప్పుడు ఏకంగా ఏడు ర్యాంక్‌లు పడిపోయింది. తీవ్రమైన ఆకలి బాధలున్న దేశాల విభాగంలో నిలిచింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, మియన్మార్‌, పాకిస్థాన్‌ ఇదే విభాగంలో ఉన్నప్పటికీ.. మన కంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఆకలి కేకలతో విలవిలలాడతోన్న అఫ్ఘానిస్తాన్‌ ర్యాంక్‌కు ఇండియాకు పెద్ద తేడా లేదు.

Read More : Telangana HC: నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జడ్జీల ప్రస్థానం ఇదే!

GHIలో అఫ్ఘానిస్తాన్‌ 103స్థానంలో నిలిచింది.5 కంటే తక్కువ GHI స్కోరుతో చైనా, కువైట్‌లు టాప్‌ పొజిషన్‌లలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపాన్ని GHI అంచనా వేస్తుంటుంది. వివిధ ప్రమాణాల ఆధారంగా GHI ర్యాంకులను నిర్ణయిస్తారు. వాటిలో ఐదేళ్లలోపు పిల్లలు తమ ఎత్తుకు తగిన బరువు లేకపోవడం ఒకటి.

ట్రెండింగ్ వార్తలు