ఆటో డ్రైవర్‌తో జరిగిన గొడవ ఓ మాజీ ఎమ్మెల్యే ప్రాణాన్ని తీసింది. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగింది. గోవాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత లావూ మామ్లేదార్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో బెళగావిలోని ఒక లాడ్జీ సమీపంలో క్యాబ్‌ను ఆయన కారు ఢీకొట్టింది.
మామ్లేదార్‌కు, ఆటో డ్రైవర్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. లావూ మామ్లేదార్ ఆగ్రహంతో ఊగిపోతూ ఆటో డ్రైవర్‌ను కొట్టాడు. దీంతో ఆటో డ్రైవర్ కూడా ఆవేశంలో లావూ మామ్లేదార్‌పై దాడి చేశాడు.
Also Read: కోహ్లీ, రోహిత్, జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్ అవుతారు.. ఎందుకో చెప్పిన ఆకాశ్ చోప్రా
ఈ ఘర్షణ పెరిగి వారు తీవ్ర స్థాయిలో కొట్టుకోవడంతో స్థానికులు వారిని ఆపారు. గొడవ తర్వాత మామ్లేదార్ లాడ్జికి వెళ్లి మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా పడిపోయారు. ఆయనను లాడ్జి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటి ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా.. లావూ మామ్లేదార్‌ని కొట్టిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
మామ్లేదార్ మృతికి కారణాలపై స్పష్టతలేకపోవడంతో దీనిపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. విచారణ తర్వాత దీనిపై పూర్తి వివరాలు తెలుపుతామని చెప్పారు. మామ్లేదార్‌కు, ఆటో డ్రైవర్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.