కరోనాతో గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కన్నుమూత

గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సురేష్ అమోంకర్ (68)కరోనా వైరస్ తో మరణించారు. గతనెల చివరి వారంలోనే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ట్రీట్మెంట్ కోసం ఆయనను మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. సురేష్ అమోంకర్ మృతి విషయాన్ని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె దృవీకరించారు. సురేష్ అమోన్‌కర్ మృతి పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
గోవాలోని పాలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999లో సురేష్ అమోంకర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత మనోహర్ పారికర్ ప్రభుత్వంలో ఆరోగ్య, సాంఘీక సంక్షేమ, కార్మిక ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశారు. 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
Read Here>>కథ అడ్డం తిరిగింది, చెల్లి పెళ్లి డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా, సల్మాన్ అరెస్ట్