Parliament Monsoon Session: మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్షం, ఒప్పుకున్న ప్రభుత్వం.. అయినా సభలో గొడవే. ఎందుకో తెలుసా?

మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా మాట్లాడాలని, ఆ తర్వాతే చర్చ జరపాలన్న డిమాండ్‌పై మొండిగా ఉన్న విపక్షాలు సభలో నిరాటంకంగా నిరసన తెలుపుతున్నాయి

Parliament Monsoon Session: మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్షం, ఒప్పుకున్న ప్రభుత్వం.. అయినా సభలో గొడవే. ఎందుకో తెలుసా?

Parliament

Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ మధ్య, కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళలపై క్రూరత్వానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. వర్షాకాల సమావేశాల రెండో రోజు ఈ అంశంపై చర్చ జరగడంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగలేదు. మణిపూర్‌లో పరిస్థితిపై ప్రతిపక్ష ఎంపీల గందరగోళం మధ్య లోక్‌సభ మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ జూలై 24 సోమవారం వరకు వాయిదా పడింది. రాజ్యసభలోనూ విపక్ష ఎంపీలు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో పాటు సభా కార్యకలాపాలు మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడ్డాయి.

Bandi Sanjay : సంజయ్‌కి అస్సలు మింగుడు పడటం లేదట.. గెలిచే చాన్స్ లేదని చెప్పకనే చెప్పేశారా?

మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా మాట్లాడాలని, ఆ తర్వాతే చర్చ జరపాలన్న డిమాండ్‌పై మొండిగా ఉన్న విపక్షాలు సభలో నిరాటంకంగా నిరసన తెలుపుతున్నాయి. శుక్రవారం కూడా ఇదే గందరగోళం కారణంగా పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్ సభ జూలై 24కి వాయిదా పడింది. చర్చ జరగాలని ప్రభుత్వ, ప్రతిపక్షాలు చెబుతున్నప్పటికీ సభా కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయి. నిజానికి విపక్షాలు కోరినట్టు చర్చకు ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ సమస్య ఏంటంటే..?

AP Politics: పవన్ కల్యాణ్ మీద పరువు నష్టం నీతిమాలిన చర్య.. సీఎం జగన్‭పై చంద్రబాబు ఫైర్

వాస్తవానికి రాజ్యసభలో ప్రతిపక్షాలకు సంఖ్యాబలం ఉంది కాబట్టి రూల్ 267 ప్రకారం చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రూల్ 267 ప్రకారం చర్చ జరిగి, ఆ తర్వాత ఓటింగు జరిపితే జరపొచ్చని వారి వాదన. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించేలా లేదు. 176వ నిబంధన ప్రకారం చర్చ జరగాలని ప్రభుత్వం కోరుతోంది. ఇవి చాలా సున్నితమైన అంశాలని, కాబట్టి సభా కార్యక్రమాలను వాయిదా వేసిన తర్వాత మణిపూర్ అంశాన్ని చేపట్టాలని విపక్షాలు అంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని, ఆ తర్వాత ఓటింగ్‌కు నిబంధన ఉంటే ఓటింగ్‌ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.