Woman Molested
UP Woman Molested : యూపీలో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ అధికారి కూతురుపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో ప్రభుత్వ అధికారి 22 ఏళ్ల కూతురుపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం ఆమె కొంతకాలంగా కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కేజీఎంయూ) ఆసుపత్రిలోని సైకియాట్రీ డిపార్ట్‌మెంట్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న ఆమె చికిత్స కోసం కేజీఎంయూ ఆసుపత్రిలోని సైకియాట్రీ డిపార్ట్‌మెంట్ కు వెళ్లారు. ఆమె తరచుగా వెళ్లే టీ వ్యాపారి సత్యం మిశ్రా దగ్గరికి తన మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ చేయడానికి వెళ్లారు.
Woman Molested : ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మహిళపై అత్యాచారం చేసి దారుణ హత్య
సత్యం మిశ్రా ఆమె మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ చేయడానికి సమీపంలో పార్క్ చేసిన అంబులెన్స్‌కు దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే, కొంత సేపటికి అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్లి పోయింది. సత్యం మిశ్రాతో కలిసి ఆమె అంబులెన్స్ కోసం వెతికారు.
అనంతరం సత్యం మిశ్రా మహిళను కారులో బారాబంకిలోని సఫేదాబాద్ ప్రాంతంలోని ఒక ధాబాకు తీసుకెళ్లాడు. అయితే కారులో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం తాగించారు. ఇందిరా నగర్ ప్రాంతంలో దించడానికి ముందు కారులో ఆమెపై ముగ్గరు వ్యక్తులు కలిసి సామూహిక లైంగిక దాడి చేశారు.
మహిళ ఫిర్యాదు మేరకు ఆదివారం వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు నిందితులపై 376 (డి), 342, 328, 323 సెక్లన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ముగ్గురు నిందితులపై ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో ఇద్దరు నిందితులను సుహైల్, మహ్మద్ అస్లాంగా గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్టు పోలీసులు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి కారు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.19,830 స్వాధీనం చేసుకున్నారు.