కోవిషీల్డ్ డోసుల మధ్య సమయాన్ని సవరించిన కేంద్రం
కోవిషీల్డ్ వ్యాక్సిన్.. రెండు డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని సోమవారం కేంద్రం సవరించింది. ప్రస్తుతం..మొదటి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నారు.

Covishield Vaccine
Govt revises కోవిషీల్డ్ వ్యాక్సిన్..రెండు డోసుల మధ్య ఉండాల్సిన విరామ సమయాన్ని సోమవారం కేంద్రం సవరించింది. ప్రస్తుతం..మొదటి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నారు. తాజాగా ఈ సమయాన్ని 4- 8 వారాలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
రెండు డోసుల మధ్య విరామానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లభించిన తర్వాత నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్, కొవిడ్ టీకాపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సవరణ కొవిషీల్డ్ టీకాకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌కు దీనితో సంబంధం లేదని వివరించింది.
కాగా, కొన్ని యూరప్ దేశాలలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు మరియు దానిని సస్పెన్షన్ చేసిన నివేదికల సమయంలో డోసుల విరామం సమయంలో కేంద్రం నిర్ణయం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతానికి దేశంలో కోవిషీల్డ్ ఉపయోగం గురించి “ఆందోళన యొక్క సంకేతం” లేదని ప్రభుత్వం పేర్కొంది.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సోమవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో…ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ NTAGI మరియు NEGVAC సిఫారసులను అంగీకరించిందని, రాష్ట్రాలు.. 1 వ మోతాదు తర్వాత 4-8 వారాల నిర్ణీత సమయ వ్యవధిలో లబ్ధిదారులకు COVISHIELD యొక్క 2 వ మోతాదు అందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ ఆధారాలను దృష్టిలో ఉంచుకుని, కోవిషీల్డ్ యొక్క రెండవ మోతాదు 6-8 వారాల మధ్య నిర్వహించబడితే రక్షణ మెరుగుపడుతుందని తెలుస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా, దేశంలో ప్రస్తుతం రెండు కోవిడ్ వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి ఈ ఏడాది జనవరిలో అమోదం లభించిన విషయం తెలిసిందే. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్,హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ లను ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పూణేలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది.