×
Ad

గుజరాత్‌ క్యాబినెట్‌లో మార్పులు.. మంత్రిగా జడేజా భార్య రివాబా ప్రమాణం.. అందరూ భగవద్గీత పట్టుకుని..

కొత్త క్యాబినెట్‌లో ఏడుగురు పాటిదార్లు, ఎనిమిది మంది ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, నలుగురు ఎస్టీలు, ముగ్గురు మహిళలు ఉన్నారు.

Jadeja’s wife Rivaba becomes minister

Gujarat Cabinet reshuffle: గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం శుక్రవారం క్యాబినెట్‌లో మార్పులు చేసింది. రాష్ట్ర హోం మంత్రి హర్ష్‌ సాంఘవి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా మంత్రిగా నియమితులయ్యారు.

గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ సహా 26 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. చేతిలో భగవద్గీత పట్టుకుని వారందరూ ప్రమాణ స్వీకారం చేశారు.

సామాజిక పరంగా, రాజకీయ పరంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మంత్రులను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. కొత్త క్యాబినెట్‌లో 19 మంది కొత్తవారు చేరగా, పాతవారిలో కొంతమంది తప్పుకున్నారు. కొత్త క్యాబినెట్‌లో ఏడుగురు పాటిదార్లు, ఎనిమిది మంది ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, నలుగురు ఎస్టీలు, ముగ్గురు మహిళలు ఉన్నారు.

Also Read: హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్న జంటకు షాక్.. బాత్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టిన యజమాని.. ఎలా బయటపడిందంటే?

ఈ 26 మందిలో ఆరుగురు పాత మంత్రులు మాత్రమే కొత్త క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 2027లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా క్యాబినెట్‌లో బీజేపీ మార్పులు చేసింది.

సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు మళ్లీ నియమితులైన మంత్రులు

రుషికేశ్‌ పటేల్‌ – విశ్నగర్‌ ఎమ్మెల్యే (ఆరోగ్యం, విద్య, చట్టం)
ప్రఫుల్‌ పాంశేరియా – కామ్రేజ్‌ ఎమ్మెల్యే (రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి)
కున్వర్జీ బవాలియా – జస్దన్‌ ఎమ్మెల్యే (నీటి వనరుల శాఖ మంత్రి)
కనుభాయ్‌ దేశాయ్ – పార్డీ ఎమ్మెల్యే (ఆర్థిక, ఇంధన, పెట్రోకెమికల్స్‌ శాఖలు)
సోలంకీ – భావనగర్‌ గ్రామీణ ఎమ్మెల్యే (మత్స్యశాఖ సహాయ మంత్రి)

కొత్తగా నియమితులైన మంత్రులు

హర్ష్‌ సాంఘవి – మజురా ఎమ్మెల్యే (ఉపముఖ్యమంత్రి, మాజీ హోం సహాయ మంత్రి)
నరేశ్‌ పటేల్‌ – గాందేవి ఎమ్మెల్యే
దర్షనా వాఘెలా – ఆసర్వా ఎమ్మెల్యే, మాజీ అహ్మదాబాద్‌ ఉపమేయర్‌
ప్రద్యుమన్‌ వాజా – కొడినార్‌ ఎమ్మెల్యే, మాజీ గుజరాత్‌ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు
కాంతిలాల్‌ అమృతియా – మోర్బీ ఎమ్మెల్యే
మనిషా వాకిల్‌ – వడోదర సిటీ ఎమ్మెల్యే
అర్జున్‌ మోద్వాడియా – పోర్‌బందర్ ఎమ్మెల్యే
జీతు వాఘాణీ – భావనగర్‌ ఎమ్మెల్యే, మాజీ గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు
కౌశిక్‌ వేకారియా – అమ్రేలీ ఎమ్మెల్యే, బీజేపీ అసెంబ్లీ డెప్యూటీ చీఫ్‌ విప్‌
స్వరూప్‌జీ ఠాకోర్‌ – బనాసకంఠా ఎమ్మెల్యే
త్రికమ్‌ ఛంగా – అంజార్‌ ఎమ్మెల్యే
జయరామ్‌ గామిట్‌ – నిజర్‌ ఎమ్మెల్యే
రివాబా జడేజా – జామ్ నగర్‌ ఉత్తర ఎమ్మెల్యే
పీ.సీ. బరండా – భిల్లోడా ఎమ్మెల్యే
రమేశ్‌ కటారా – దహోడ్‌ ఎమ్మెల్యే
ఇశ్వర్‌సింహ్‌ పటేల్‌ – అంక్లేశ్వర్‌ ఎమ్మెల్యే
ప్రవీణ్‌ మాలీ – దీసా ఎమ్మెల్యే
రమణభాయ్‌ సోలంకీ – బోర్సాద్‌ ఎమ్మెల్యే
కమ్లేష్‌ పటేల్‌ – పెట్లాడ్‌ ఎమ్మెల్యే
సంజయ్‌సింగ్‌ మహిదా – మహుధా ఎమ్మెల్యే