హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్న జంటకు షాక్.. బాత్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టిన యజమాని.. ఎలా బయటపడిందంటే?
నగరంలోని జవహర్ నగర్‌లో చోటుచేసుకుంది ఈ ఘటన. తాజాగా ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Hyderabad Crime: ఉద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్‌కు చాలా మంది వచ్చి రెంటుకు ఉంటారు. అలాగే వచ్చి ఓ ఇంటిని రెంటుకు తీసుకుని ఉంటున్న ఓ జంటకు షాకింగ్ ఘటన ఎదురైంది.
వారు ఉంటున్న ఇంటి బాత్‌రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాడు ఓనర్. నగరంలోని జవహర్ నగర్‌లో చోటుచేసుకుంది ఈ ఘటన. తాజాగా ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది.
Also Read: బస్సు టికెట్లా? విమానం టికెట్లా? మరీ ఘోరం.. దీపావళి దోపిడీ మరీ ఇంత దారుణంగానా..!
ఏం జరిగింది?
అశోక్ యాదవ్ అనే ఓ వ్యక్తి ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం బాత్‌రూమ్‌లో బల్బ్ పనిచేయలేదు. దీంతో వారు ఈ నెల 4న ఆ బల్బ్ పనిచేయడం లేదని అశోక్‌కు చెప్పారు.
ఎలక్ట్రీషియన్ చింటూను తీసుకొచ్చిన అశోక్ బల్బ్ రిపేర్ చేయించాడు. ఇటీవల బల్బ్ హోల్డర్ నుంచి స్క్రూ పడిపోయింది. దీంతో అద్దెకు ఉంటున్న వ్యక్తి దాన్ని గమనించి పరిశీలించాడు. అందులో రహస్య కెమెరా కనపడింది. కెమెరా పెట్టడం ఏంటని అశోక్‌ను ఆ దంపతులు నిలదీశారు.
దీంతో దంపతులనే బెదిరించే ప్రయత్నం చేశాడు అశోక్. దీనిపై ఫిర్యాదు చేస్తే ఆ దంపతులపై ఎలక్ట్రిషియన్ చింటూ పగబడతాడని, వదలబోడని అశోక్ హెచ్చరించాడు. పోలీసులకు ఆ దంపతులు ఫిర్యాదు చేయడంతో అశోక్‌ను అరెస్ట్ చేశారు. ఎలక్ట్రిషియన్ చింటూ పరారీలో ఉన్నాడు.