బస్సు టికెట్లా? విమానం టికెట్లా? మరీ ఘోరం.. దీపావళి దోపిడీ మరీ ఇంత దారుణంగానా..!
కొన్ని బస్సుల్లో రెండు-మూడు రెట్లు పెంచేడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Bus fares: దీపావళి పండుగ వేళ ఈ సారి వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో హైదరాబాద్ నుంచి చాలా మంది తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులకేగాక ప్రైవేట్ బస్సులు రద్దీగా కనపడుతున్నాయి.
ప్రైవేటు బస్సుల్లో టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. కొన్ని బస్సుల్లో రెండు-మూడు రెట్లు పెంచేడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రూ.500 ఉండే టికెట్ ధర రూ.1,000-రూ.1500 వరకు పెరిగింది. (Bus fares)
Also Read: చంద్రబాబుపై “అలిపిరి దాడి”లో కీలక పాత్ర పోషించిన ఆశన్న లొంగుబాటు.. ఈ మావోయిస్టు నేత చరిత్ర ఇదే..
టికెట్ రేట్లపై సర్కారు కంట్రోల్ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు అంటున్నారు. దీపావళి వేళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నాయి.
ప్రత్యేక రైళ్లు
పండుగ వేళ దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి నుంచి ఈ నెల 23 వరకు మొత్తం 26 స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది. ఈ ట్రైన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి ఉంటాయి. అవి తిరుపతి, విజయవాడ, భువనేశ్వర్, చెన్నై, యశ్వంత్‌పూర్ ప్రాంతాలకు వెళ్తాయి.