Gujarat Govt : బడిలో భగవద్గీత.. గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం

మొత్తం 18 అధ్యాయాలున్న భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అయితే, పాఠ్యాంశాలలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో రామాయణం, మహా భారత్ ఇతి వృత్తాంతాలను చేర్చాయి. జాతీయ విద్యావిధానం..

Bhagavad Gita In School Syllabus : గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆ రాష్ట్రంలోని పాఠశాలల్లో భగవద్గీత ఓ సబ్జెక్ట్‌గా ఉండబోతోంది. 6 నుంచి 12 తరగతి పాఠ్యాంశాలలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేరుస్తున్నట్లు తెలిపారు. దీనిపై గుజరాత్ విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Read More : Covid-19 : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

కేంద్రం ప్రకటించిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. విద్యార్థుల్లో మానవతా విలువలను పెంచేందుకు, వారిని సన్మార్గంలో నడిపించేందుకు భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అదే విధంగా మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు భావి తరాలకు తెలుస్తాయని అన్నారు. గుజరాత్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాన్ని చాలా మంది ఆహ్వానిస్తున్నారు. భగవద్గీత ఆధారంగా శ్లోకం, వక్తృత్వం, నాట్యం, క్విజ్‌లాంటి సృజనాత్మక పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.

Read More : Afghanistan Girls: వచ్చే వారం నుంచి పాఠశాలలకు వెళ్లనున్న అఫ్గాన్ బాలికలు

మొత్తం 18 అధ్యాయాలున్న భగవద్గీతలో 700 శ్లోకాలు వున్నాయి. అయితే, పాఠ్యాంశాలలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో రామాయణం, మహా భారత్ ఇతి వృత్తాంతాలను చేర్చాయి. జాతీయ విద్యావిధానం, ఎన్ఈపీ 2020 ప్రకారం.. ఇంజనీరింగ్ సిలబస్ లలో కూడా వీటిని చేర్చారు. ప్రస్తుతం భగవద్గీత నిర్ణయంపై ప్రతి పక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు