ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 2012 నాటి నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. నిర్భయ కేసులో న్యాయం జరగటానకి జరుగుతున్న ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 2012 నాటి నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. నిర్భయ కేసులో న్యాయం జరగటానకి జరుగుతున్న ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఢిల్లీప్రభుత్వం గత రెండున్నరేళ్ళలో నిర్బయ కేసు నిందితులకు క్షమాభిక్ష పిటీషన్ దాఖలు చేసేందుకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని ప్రశ్నించారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చిన వారంలోనే ఆప్ ప్రభుత్వం దోషులందరికీ నోటీసులు ఇచ్చి ఉంటే ఈ పాటికి వారిని ఉరి తీసి ఉంటే న్యాయం జరిగేదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో దోషులుగా ఉన్న నలుగురు వ్యక్తులు ముఖేశ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్ (అక్షయ్ ఠాకూర్)(31)పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి సతీశ్ కుమార్ అరోరా ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ 14 రోజుల్లో దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ఢిల్లీ పాటియాలా కోర్టు సూచించింది. దీంతో నిందితుల్లో ఒకరైన ముకేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్షశ్ర పిటీషన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చేరింది. ఆ క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నక్ సిఫార్సు చేశారు.
2012 డిసెంబర్ 16 వ తేదీ రాత్రి ఢిల్లీలోని బస్సులో 23 ఏళ్ళ మహిళపై అత్యాచారం చేసినందుకు నిందితులకు కోర్టు మరణశిక్ష విదించింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు వారిని ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలో దోషుల్లో ఇద్దరు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్లు దాఖలు చేయగా వాటిని న్యాయస్ధానం కొట్టి వేసింది. దీంతో దోషుల్లో మరోకరైన ముకేష్ సింగ్ రాష్ట్రపతి. ఢిల్లీ ప్రభుత్వానికి క్షమాభిక్ష పిటీషన్ పెట్టుకున్నాడు. క్షమాభిక్ష పిటీషన్ పెండింగ్ లో ఉన్నందున ఉరిశిక్ష అమలు చేసేందుకు నిబంధనలు ఒప్పకోవని తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ఫ్రభుత్వానికి లేఖ రాశారు.