Harsh Goenka shares funny video on 70 hour work week
70-hour work week: వీక్లీ 70 వర్కింగ్ అవర్స్ పై ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కమెంట్ చేయడంతో దీనిపై దేశవ్యాప్తంగా డిబేట్ నడుస్తోంది. ఐటీ ప్రొఫెనల్స్ వారానికి 70 గంటలు పనిచేయాలని ఓ పాడ్ క్యాస్ట్ లో ఆయన అన్నారు. నారాయణమూర్తి మాటలకు మద్దతుగా, వ్యతిరేకంగా చర్చలు నడుస్తున్నాయి. ఎన్నిగంటలు పని చేశామన్న దానికంటే, ఎంత సమర్థవంతంగా పని చేశామన్నదే ముఖ్యమన్న వాదనలు ఎక్కువగా విన్పిస్తున్నాయి.
మరోవైపు సోషల్ మీడియాలోనూ రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఎక్స్ (ట్విటర్)లో యాక్టివ్ గా ఉండే హర్ష్ గోయాంక తనదైన శైలిలో స్పందించారు. పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చేలా ఫన్నీ వీడియో షేర్ చేశారు. మనం వారానికి 70 గంటలు పనిచేయడం గురించి చర్చిస్తున్నప్పుడు, తెలివిగా పని చేయడం గురించి కూడా ఆలోచించాలి.
ఇదిగో మంచి ఉదాహరణ అంటూ క్యాప్షన్ జోడించారు.
వీడియోలో ఏముంది?
ఆగివున్న స్కూటర్ పై ముగ్గురు వ్యక్తులు కూర్చునివుంటారు. ముందు కూర్చున్న వ్యక్తి బండి దిగకుండానే కొద్దిదూరంలో పడివున్న బంతిని బ్యాట్ తో అందుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో బ్యాట్ కింద పడిపోతుంది. చివర్లో కూర్చున్న వ్యక్తి బండి నుంచి దిగి బ్యాట్ ను తెచ్చి మొదటి వ్యక్తి చేతిలో పెడతాడు. మధ్యలో ఉన్న వ్యక్తికి కోపం వచ్చి బండి దిగొచ్చి బ్యాట్ తెచ్చిచ్చిన వ్యక్తిని చెంపపై కొట్టి.. బంతిని బ్యాట్ కు అందేలా దగ్గరగా పెడతాడు. ఇదంతా చూస్తున్న మొదటి వ్యక్తికి చిర్రెత్తికొచ్చి ఇద్దరినీ చెరోటి పీకుతాడు. తర్వాత ముగ్గురు కలిసి స్కూటర్ ను ఎత్తిపట్టుకుని బంతికి దగ్గరకు తీసుకొస్తారు. అప్పుడు బ్యాట్ తో బాల్ తీసుకుని కూల్ గా బయలు దేరతారు.
While we discuss the merits of a 70 hour week, we also need to think of working smart.
Here is a shining example ?! pic.twitter.com/Ii2T2FwPfS— Harsh Goenka (@hvgoenka) November 1, 2023
సూటిగా సుత్తి లేకుండా..
ఈ వీడియో చూస్తున్నంతసేపు చాలా కామెడీగా అన్పిస్తుంది. అదే సమయంలో ఆలోచింపచేస్తుంది కూడా. పనిచేసేటప్పుడు బుర్ర వాడాలన్న మెసేజ్ ఈ వీడియోలో ఉంది. స్మార్ట్ గా పని చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో వివరిస్తుంది. కాబట్టి ఎంతసేపు పనిచేశామన్నది కాకుండా ఎంత తెలివిగా పనిచేశామన్నదే ముఖ్యమని తేల్చి చెబుతుంది. వంద మాటలు అవసరం లేకుండా ఒక్క ఫన్నీ వీడియోతో కళ్లకు కట్టినట్టు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశారు.
Also Read: 43 ఏళ్లు ఉత్తరాల్లోనే ఊసులాడుకున్న స్నేహితులు మొదటిసారి కలిసిన మధుర జ్ఞాపకం..!!