Letters : 43 ఏళ్లు ఉత్తరాల్లోనే ఊసులాడుకున్న స్నేహితులు మొదటిసారి కలిసిన మధుర జ్ఞాపకం..!!

‘ఉత్తరాలు’మనస్సులోంచి వచ్చిన భావాలను అక్షరాలుగా మార్చి స్నేహితులకు స్వయంగా చెక్కిన శిల్పాలను కానుకగా ఇచ్చే మధుర జ్ఞాపకాలు. వెయ్యి వాట్సాప్ మెసేజుల్లో లేని ఆనందం ‘ఒక్క ఉత్తరం’రాస్తే కలుగుతుంది.

Letters : 43 ఏళ్లు ఉత్తరాల్లోనే ఊసులాడుకున్న స్నేహితులు మొదటిసారి కలిసిన మధుర జ్ఞాపకం..!!

letter carries an emotion between friends

Updated On : November 2, 2023 / 2:19 PM IST

Letter carries an emotion : ఉత్తరం. ఒకనాటి జ్ఞాపకం. స్వయంగా చేతులతో రాసిన అక్షరాలు ఎంతటి పదిలమో కదా.. ఉత్తరం రాసేటప్పుడు స్పందించిన మధుర క్షణాలు కళ్లముందు మెదులుతుంటే..అది అందుకున్నవారి కళ్లముందు అవి దృశ్యాలుగా కదులుతుంటే వాహ్….ఆ ఆనందం ఈనాడు ఉందా..? అంటే లేదనే చెప్పాలి. ఇప్పుడంతా వాట్సాప్ చాటింగులే..స్వతంగా చేతులతోనే అక్షరాలను టైప్ చేసి పంపించినదాంట్లో ఆనదమేంటుంటుంది..మహా అయితే ఆ మెసేజ్ అందుకున్నవారు స్టోరేజ్‌ ఎక్కవైందని డిలీట్‌ చేయటం తప్ప అనేలా ఉండటం తప్ప..

వాట్సాప్ లో ఎవరెవరో మెసేజులు పంపిస్తుంటారు. అవి వాళ్లు రాసినవీ కాదు..క్రియేట్ చేసినవీ కాదు..వాళ్లకు ఎవరో పంపిస్తారు..అవి మరొకరి ఫార్వాడ్ చేస్తుంటారు. తెల్లారి లేస్తే ఏదోక ఫార్వాడ్ మెసేజ్ మన ఫోన్లోకొచ్చి కూర్చుంటుంది. అది మనస్సుతో చేసేదేకాదు..స్పందించి పంపించేది కాదు. కానీ ‘ఉత్తరాలు’అలా కాదు..మన మనస్సులోంచి వచ్చిన భావాలను అక్షరాలుగా మార్చి స్నేహితులకు స్వయంగా చెక్కిన శిల్పాలను కానుకగా ఇచ్చే మధుర జ్ఞాపకాలు. వెయ్యి వాట్సాప్ మెసేజుల్లో లేని ఆనందం ‘ఒక్క ఉత్తరం’రాస్తే కలుగుతుంది. లక్ష మెసేజులు అందుకున్నా కలగని ఆనందం ‘ఒక్క ఉత్తరం’అందుకుని చదువుకుంటే కలుగుతుంది.ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఉత్తరం అంటే ఓ జ్ఞాపకం.. తోకలేని పిట్ట అని పిలుచుకునే ఓ అపురూప బహుమానం..

letter carries an emotion between friends

childhood friends Crystal Alston,Haley Briggs

ఇంతకీ ఈ ఉత్తరాల ఊసులేంటీ అని అనుకుంటున్నారా..? సాధారణంగా ఇద్దరు స్నేహితులు కలిస్తే ఎన్నెన్నో ముచ్చట్లుంటాయి చెప్పుకోవటానికి.. కానీ ఏకంగా 43 ఏళ్ల పాటు ఉత్తరాల్లోనే ఊసులాడుకున్న ఇద్దరు స్నేహితులు ప్రత్యక్షంగా కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..వావ్..చాలా గొప్ప అనుభూతికి లోనై ఉంటారు అని అనిపిస్తుంది కదా..? కానీ ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో కలిసి చదువుకున్న ఇద్దరు స్నేహితులు 43 ఏళ్లు అస్సలు కలవకుండా కేవలం ఉత్తరాల ద్వారానే మాట్లాడుకుని మొదటిసారి కలుసుకున్నవారు మాత్రం ఏమీ మాట్లాడుకోలేదు. పైగా మేం మాట్లాడుకోవటానికి ఏముంటాయి…? అన్ని ఉత్తరాల్లోనే మాట్లాడేసుకున్నాం కదా..? అంటూ అదో సాధారణ విషయంలో చెప్పారు ఈ అపురూప ‘ఉత్తరాల స్నేహితులు’..

వాళ్లు.. క్రిస్టల్ ఆల్స్టన్, హేలీ బ్రిగ్స్. వీరిద్దరు 1980లో కలిసి చదువుకున్నారు. క్రిస్టల్ కాలిఫోర్నియాలోని అంటారియోలో ఉంటుంది. హేలీ పెన్సిల్వేనియాలోని డగ్లస్‌విల్లే ఉంటాడు. వీరిద్దరు ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్నప్పుడు మొదటిసారి స్కూల్ ప్రాజెక్టు విషయంలో కలుసుకున్నారు. మొదటిసారే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అప్పుడు వారిద్దరికి 10 ఏళ్లు. స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మాస్టార్లు లెటర్ రాయమన్నారు. అలా వారిద్దరు ఒకరికి మరొరకు ఉత్తరాలు రాసుకున్నారు. అలా మొదలైంది వారి ఉత్తరాల కథ.అక్కడి నుంచి ఉత్తరప్రత్యుత్తరాలు ఇద్దరి మధ్యా మొదలై 43 ఏళ్లు కొనసాగింది.

స్కూల్ చదువులు అయిపోయాక ఎవరికి వారు విడిపోయారు. చదువుల కోసం..ఉద్యోగాలు..ఎవరి జీవితాల్లో వారి బిజీ అయిపోయారు. కానీ ఇద్దరు ఉత్తరాలు రాసుకోవటం మాత్రం మానలేదు. ఆ ఉత్తరాల్లో ఎన్నో ఊసులు చెప్పుకునేవారు. ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోని విషయాలను కూడా మాట్లాడుకునేవారు ‘అక్షరాల రూపం’లో..ఉత్తరాల్లో తప్ప ఇద్దరు ఎప్పుడు డైరెక్టుగా కలిసింది లేదు. అయినా వారికి ఒకరిమీద ఒకరికి ఎంతో ప్రేమ. మరెంతో మమకారం.

అలా వారు 43 ఏళ్ల తరువాత మొదటిసారి కలుసుకున్నారు. కానీ ఏమీ మాట్లాడుకోలేదు. అదే విషయం అడిగితే మాకు మాట్లాడుకోవటానికి ఏముంటాయ్..? అన్ని ఉత్తరాల్లోనే మాట్లాడేసుకున్నాం కదా అంటూ నవ్వేశారు. మేము 43 ఏళ్ల తరువాత మొదటిసారిగా కలిసినట్లుగా మాకేమీ అనిపించటంలేదన్నారు. ఈ కలయికలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. ఎందుకంటే మా ఇద్దరి గురించి మాకు తెలుసు అంటున్నారు ఈ ఉత్తరాల దోస్తులు..

తమ 50వ పుట్టిన రోజు సందర్భంగా 2020లో కలుద్దామనుకున్నారు. కానీ అప్పుడు కోవిడ్ వల్ల కలవలేకపోయారు. కానీ ఇప్పుడు కలిసిన ఉత్తరాల దోస్తులిద్దరు కలిసి కూర్చుని ఇష్టమైనవి తిన్నారు. ఇటాలియన్ డిన్నర్ కలిసి చేశారు. కానీ ఇన్నాళ్లు ఉత్తరాల ద్వారా మాట్లాడుకుంటున్న స్నేహితులు ఇక నుంచి సోషల్ మీడియానే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా సులభమైన మార్గం. అలాగే, ఒకరి ముఖం మరొకరు చూసుకోవచ్చు కదా అంటున్నారు. నిజంగా క్రేజీ ఫ్రెండ్స్ కదా..

కానీ ఉత్తరానికుండే ప్రత్యేకతే వేరు. ఉత్తరాల్లో రాసే ప్రతి పదం ఎప్పటికీ మధురజ్ఞాపకంగా ఉంటుందనటం అతిశయోక్తి కాదు. ఎన్ని సంవత్సరాలైనా..ఎన్ని దశాబ్దాలు అయినా ఎమెషన్ ను క్యారీ చేసేది ఉత్తరమే..ఏది ఏమైనా ఈ ఉత్తరాల దోస్తుల కథ భలే క్రేజీ అనే చెప్పాలి.