Interpol : హర్యానా గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్‌కు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు
హర్యానా రాష్ట్రానికి చెందిన కరడుకట్టిన గ్యాంగ్ స్టర్ యోగేష్ కద్యన్ కు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. 19 ఏళ్ల యోగేష్ కద్యన్‌పై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్టం కింద అభియోగాలు మోపారు.....

gangster Yogesh Kadyan
Interpol : హర్యానా రాష్ట్రానికి చెందిన కరడుకట్టిన గ్యాంగ్ స్టర్ యోగేష్ కద్యన్ కు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. 19 ఏళ్ల యోగేష్ కద్యన్‌పై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్టం కింద అభియోగాలు మోపారు. చిన్న వయసులోనే పలు నేరాలకు పాల్పడిన గ్యాంగ్ స్టర్ కద్యన్ అమెరికా దేశానికి పారిపోయి అక్కడ ఆశ్రయం పొందుతున్నాడని వెల్లడైంది.
Also Read : Reliance Board : రిలయన్స్ బోర్డు డైరెక్టర్లుగా ముఖేష్ అంబానీ పిల్లలు
నకిలీ పాస్ పోర్టుతో కద్యన్ పారిపోయాడని భావిస్తున్నారు. గ్యాంగ్ స్టర్, ఉగ్రవాద నెట్ వర్క్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దృష్టి సారించడంతో పలువురు గ్యాంగ్ స్టర్లు నకిలీ పాస్ పోర్టులతో విదేశాలకు పారిపోయారని సమాచారం. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ యోగేష్ ఆచూకీ లభిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read : Hamas terrorists : ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ల దాడి..ముగ్గురు హమాస్ ఉగ్రవాదుల హతం