ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కోసం ట్యాబ్లెట్లు పంచనున్న హర్యానా

Haryana govt: హర్యానా గవర్నమెంట్ శనివారం స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివే పిల్లలకు ఉచితంగా ట్యాబ్లెట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభ సమయంలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే హర్యానా హెల్త్ మినిష్టర్ అనిల్ విజ్ స్కూల్ రీ ఓపెనింగ్ కు మరో 10రోజులు పడుతుందని చెప్పారు.
అంతకంటే ముందు హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ను నవంబర్ 30న రీ ఓపెన్ చేస్తామని, కరోనావైరస్ కారణంగా అప్పటివరకూ క్లోజ్ గానే ఉంటాయని చెప్పారు. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం సవరించుకుంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 10న ఓపెన్ చేస్తామని రీసెంట్ గా చెప్పారు.
ఈ సమయంలో స్టూడెంట్స్.. టీచర్లు చెప్పే ఆన్ లైన్ క్లాసులకు దూరం కాకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ స్కీమ్ కారణంగా యాక్టివ్ గా క్లాసుల్లో పాల్గొంటారని తెలిపారు. అంతకంటే ముందు హర్యానా జిల్లాలైన రెవారీ, జింద్, ఝాజ్జర్ లలో స్టూడెంట్స్ కు చేసిన టెస్టుల్లో 150మందికి పాజిటివ్ వచ్చింది. హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆదేశాలు అందేవరకూ స్కూల్స్ మూసే ఉంచాలని ఫిక్స్ చేశారు.