గల్లీ దొంగలే టార్గెట్ : సైకిళ్ల పై పోలీసులు పెట్రోలింగ్

హర్యానాలోని గుర్గావ్ లో పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకుని సైకిల్ పై పెట్రోలింగ్ చేయాలని గుర్గావ్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీజ్ జీపుల్లోను..వ్యాన్ లలోను పెట్రోలింగ్ కేవలం విశాలమైన రోడ్లకు మాత్రమే పరిమితమవుతోంది. కానీ ఇరుకు గల్లీల్లోకి వెళ్లే వీలులేని పెట్రోలింగ్ తో ఉపయోగం తక్కువగా ఉంటుంది.దీంతో గుర్గావ్ పోలీసులు ఇకపై సైకిళ్లపై పెట్రోలింగ్ చేయాలని నిర్ణయించింది.
ఎందుకంటే అవి బిజీగా ఉన్న మార్కెట్ ప్రాంతాల్లోను..ఇరుకైన వీధుల గుండా పోలీసులు విధులు నిర్వహించేందకు వీలుగా ఉంటుందని ఈ నిర్ణయించారు. దీని వల్ల ప్రజలకు మరింత చేరువగా ఉండేలా వీలు కలుగుతుందంటున్నారు. “బీట్ సైకిల్” పేరుతో పోలీస్ కమిషనర్ మహ్మద్ అఖిల్ సోమవారం (డిసెంబర్ 9) ప్రారంభించారనీ గుర్గావ్ పోలీసు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (ప్రో) సుభాష్ బోకన్ తెలిపారు.
గుర్గావ్ లోని పలు ప్రాంతాల్లో పెట్రోలింగ్ కోసం సైకిల్స్ తో పాటు ప్రతీ పోలీస్ కు హెల్మెట్లు కూడా ఇచ్చామని తెలిపారు. చైన్స్ స్నాచింగ్ చేసి గల్లీల్లోకి పారిపోయే చైన్ స్నాచర్స్ ను పట్టుకోవటానికి కూడా ఈ ‘‘బీట్ సైకిల్’ పెట్రోలింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
“బీట్ సైకిల్” పెట్రోలింగ్ తో కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చనీ..ప్రజలకు మరింతగా పోలీస్ సేవల్ని అందించవచ్చని అన్నారు. దీంతో ప్రజలకు పోలీసులకు మద్య మంచి స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయిని అభిప్రాయపడ్డారు. పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు వద్ద లాఠీ, ఓ నోట్ బుక్, ఫ్లాష్ లైట్ వంటి అవసరమైనవి ఉండాలని పోలీసు కమిషనర్ మహ్మద్ అకిల్ ఆదేశించారు.
Haryana: Police personnel patrol on bicycles in Gurugram as part of the ‘beat-cycle’ programme. (9.12.19) pic.twitter.com/neg2XtVSxf
— ANI (@ANI) December 9, 2019