Viral video: ఒత్తిడిని జయించి.. కరోనా రోగుల వార్డుల్లో డాక్టర్ల డాన్స్‌లు
Doctors Viral video: భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ భయం పుట్టిస్తుంది. ఆసుపత్రులు, డాక్టర్లు మరియు ఇతర ఫ్రంట్‌లైన్ కార్మికులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ సమయంలో ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి చేయవల్సిన ప్రయత్నాలు మొత్తం చేస్తున్నారు డాక్టర్లు.
దేశంలో రోగుల ఆర్తనాదాల మధ్య పని ఒత్తిడి, ఆస్పత్రుల్లో మరణాలు చూసి తట్టుకుని డాక్టర్లు పని చేస్తుండగా.. బాధితులకు చికిత్స అందిస్తూనే వారిలో ధైర్యం నింపుతున్నారు. కరోనా పేషెంట్లలో ఉత్సాహాన్ని నింపుతూ.. పీపీఈ కిట్లలోనే డ్యాన్స్‌లు వేస్తూ డాక్టర్లు కరోనా వార్డులో చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డాక్టర్లు స్టెప్పులేస్తుంటే బాధితులు చప్పట్లు కొడుతూ బాధను మరిచిపోతున్నారు. కోవిడ్ వార్డులోని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. గుర్మీత్ చద్దా అనే నెటిజన్ వీడియోని షేర్ చెయ్యగా.. ‘‘డాక్టర్లకు, హాస్పిటల్ సిబ్బందికి హాట్సాఫ్.. పాటకు స్టెప్పులేస్తూ పెదవులపై చిరునవ్వులు పూయించిన డాక్టర్లు గొప్పవాళ్లు” అంటూ కామెంట్ చేస్తున్నారు.
Amazing spirit. Salute Our doctors & healthcare warriors!
Brought a smile ..
PS- beautiful song as well ( fwd)@deepaksidhu pic.twitter.com/M53pPTyJqw
— Gurmeet Chadha (@connectgurmeet) April 28, 2021