Heavy Rains : సౌత్ ఇండియాలో వర్ష బీభత్సం.. నవంబర్‌లో 143.4 శాతం వర్షాలు.

దక్షిణ భారతదేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

Heavy Rains (2)

Heavy Rains :  దక్షిణ భారతదేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. అక్టోబర్ 1 నవంబర్ 25 మధ్య 63 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 1 ఈశాన్య రుతుపవనాల ప్రారంభం కాగా ఈ సీజన్‌లో కేరళలో 110 శాతం వర్షపాతం, కర్ణాటకలో 105, పుదుచ్చేరిలో 83, తమిళనాడులో 61 శాతం వర్షపాతం నమోదైంది. నవంబర్ నెలలో కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, తమిళనాడులోని చెన్నై ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి.

చదవండి : Heavy Rains : చిత్తూరు జిల్లాకు రూ.500 కోట్ల నష్టం

గత నెల రోజులుగా తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గురు శుక్రవారాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. కాయలపట్టణంలో 31, టుటికోరిన్‌లో 27, తిరుచెందూరులో 25, శ్రీవైకుంటంలో 18, కులశేఖరపట్నంలో 16, వప్పర్‌లో 15, నాగపట్నంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికి జలదిగ్బందంలోనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వర్షాలు కురుస్తున్నాయి.

చదవండి : Heavy Rains : కడప జిల్లాలో వర్ష బీభత్సం..జలదిగ్బంధంలో గ్రామాలు..నీట మునిగిన పంటలు

నవంబర్ నెలలో ప్రతి వారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 29న అండమాన్ సముద్రం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలతో మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా, నవంబర్ మొదటి వారంలో ఏపీలో వర్షాలు ప్రారంభమయ్యాయి. 20 రోజులు అవుతున్న తగ్గడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇక ఈ నెలలో కురిసిన వర్షం సాధారణ వర్షపాతం కంటే 63 శాతం ఎక్కువని ఐఎండీ అధికారులు తెలిపారు.