×
Ad

Heavy Rains : రానున్న ఐదు రోజులు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

  • Published On : July 18, 2023 / 01:29 PM IST

Heavy Rains (11)

IMD Weather Warnings : రానున్న ఐదు రోజులు దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు ఐఎండీ వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం, బుధవారం ఉత్తరాఖండ్, ఈస్ట్ రాజస్థాన్ లో వర్షాలు కురిసే అవకాశాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గడ్ లో వర్షం కురిసే అవకాశముందని చెప్పింది.

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఆరంజ్ అలర్ట్ జారీ

జులై 20, 21 తేదీల్లో ఒడిశా, అసోం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మంగళవారం అండమాన్ నికోబార్ దీవుల్లో, వెస్ట్ రాజస్థాన్ లో బుధవారం వరకు, ఈస్ట్ రాజస్థాన్ లో 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

జమ్ము కాశ్మీర్, లద్ధాక్, గిల్గిట్ బాలిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్ లో బుధవారం నుంచి జులై 21 వరకు వర్షాలు పడతాయని తెలిపింది. ఒడిశా, సెంట్రల్ రీజియన్ లో రాబోయే ఐదు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.