Traffic Jam : ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్

భారత్‌ బంద్‌తో పాటు కాంగ్రెస్ నిరసనల కారణంగా... NCRలో పరిధిలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు.

Heavy traffic jam : నేషనల్ క్యాపిటల్ రీజియన్ పూర్తిగా జామ్ అయిపోయింది. ఢిల్లీ -యూపీ, ఢిల్లీ – హర్యానా మధ్య ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్ ప్రభావం ఢిల్లీ పరిధిలో పెద్దగా లేకపోయినా… తనిఖీల పేరుతో పోలీసులు వాహనాలు నిలిపివేయడంతో ప్రధాన మార్గాల్లో వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. భారత్‌ బంద్‌తో పాటు కాంగ్రెస్ నిరసనల కారణంగా… NCRలో పరిధిలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు.

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలకు ప్లాన్‌ చేశారు. పార్లమెంట్ భవనం, ప్రధాన మంత్రి కార్యాలయం, రాష్ట్రపతి భవన్‌లే టార్గెట్‌గా అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు జరిగే అవకాశముండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారత్‌ బంద్‌తో ఢిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టడంతో వెహికల్స్ ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్‌లో గంటలకొద్దీ చిక్కుకుపోయి ఢిల్లీ వాసులు నానా అవస్థలు పడుతున్నారు.

Agnipath Scheme: భారత్ బంద్ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంపు.. పలు రైళ్లు రద్దు

ఆర్మీలో నాలుగేళ్లు పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ కు ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి ఆర్మీలో ఉద్యోగాల భర్తీని చేపట్టాని డిమాండ్ చేస్తూ బంద్ లో పాల్గొంటున్నారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు.

రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంపుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే భారత్ బందుకు ఎలాంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. అగ్నిపథ్ పథకానికి నిరసనగా జార్ఖండ్ బంద్‌కు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. దీంతో జార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలు వాయిదా పడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు