Agnipath Scheme: భారత్ బంద్ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంపు.. పలు రైళ్లు రద్దు

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ కు ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి ఆర్మీలో ఉద్యోగాల భర్తీని చేపట్టాని డిమాండ్ చేస్తూ బంద్ లో పాల్గొంటున్నారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP) అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంపుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Agnipath Scheme: భారత్ బంద్ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంపు.. పలు రైళ్లు రద్దు

Barath Bandh (1)

Agnipath Scheme: ఆర్మీలో నాలుగేళ్లు పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ కు ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి ఆర్మీలో ఉద్యోగాల భర్తీని చేపట్టాని డిమాండ్ చేస్తూ బంద్ లో పాల్గొంటున్నారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP) అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంపుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే భారత్ బందుకు ఎలాంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. అగ్నిపథ్ పథకానికి నిరసనగా జార్ఖండ్ బంద్‌కు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) పిలుపునిచ్చింది. దీంతో జార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలు వాయిదా పడ్డాయి.

Anand Mahindra: అగ్నివీరులకు ఉద్యోగమిస్తా.. ఆనంద్ మహింద్రా బంపర్ ఆఫర్..

బీహార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో దాదాపు ఇరవై జిల్లాల్లో అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేసింది. బీహార్‌లోని కైమూర్, భోజ్‌పూర్, బక్సర్, ఔరంగాబాద్, రోహ్తాస్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సమస్తిపూర్, నవాడా, బెగుసరాయ్, లఖిసరాయ్, సరన్, వైశాలి, ముజఫర్‌పూర్, దర్భంగా, మధుబని, గయా, ఖగారియా, జెహనాబాద్ లలో అంక్షలు విధించింది. అదేవిధంగా పంజాబ్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. యూపీలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇక జైపూర్‌, నోయిడాలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. బంద్ పేరుతో ఎవరైనా రోడ్డెక్కితే కఠిన సెక్షన్ల కింద కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. బంద్ పేరుతో విధ్వంసానికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్ని RPF యూనిట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని కఠినమైన సెక్షన్ల కింద నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.

National Herald Case: నేడు ఈడీ ముందు హాజరుకానున్న రాహుల్ గాంధీ.. రాష్ట్రపతిని కలవనున్న కాంగ్రెస్ నేతలు

అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా నిరసనలతో పాటు దేశవ్యాప్త బంద్ నేపథ్యంలో 491 రైళ్లు రద్దయ్యాయి. ఇందులో 229 మెయిల్ ఎక్స్‌ప్రెస్, 254 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. మరో ఎనిమిది మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. భారత్ బంద్ నేపథ్యంలో బెంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హౌరా స్టేషన్, హౌరా బ్రిడ్జ్, సంత్రాగచ్చి జంక్షన్, షాలిమార్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ రైల్వే స్టేషన్ల వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. రెండు రోజుల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు. ఇక ఏపీలోని విజయవాడ రైల్వే స్టేషన్ తో పాటు పలు రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు.