Hidden Camera: దూరదర్శన్ సెంటర్‌లోని మహిళా బాత్రూంలో సీక్రెట్ కెమెరా
కేరళలోని తిరువనంతపురం దూరదర్శన సెంటర్ వాష్ రూంలో సీక్రెట్ కెమెరా కనిపించింది. అది కూడా మహిళల బాత్రూంలో కనిపించడం కలకలం రేపింది. ఆదివారం ఓ మహిళ ఈ విషయాన్ని గుర్తించారు.

Hideen Camera
Hidden Camera: కేరళలోని తిరువనంతపురం దూరదర్శన సెంటర్ వాష్ రూంలో సీక్రెట్ కెమెరా కనిపించింది. అది కూడా మహిళల బాత్రూంలో కనిపించడం కలకలం రేపింది. ఆదివారం ఓ మహిళ ఈ విషయాన్ని గుర్తించారు. అధికారులు బుధవారం పోలీసులను కలిసి కంప్లైంట్ చేశారు. సైబర్ సెల్ పోలీసులు కేస్ రిజిష్టర్ చేసుకుని దర్యాప్తు చేశారు.
ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగిగా జాయిన్ అయిన ఒక వ్యక్తి సీసీ కెమెరా అరేంజ్ చేసినట్లు తెలిసింది. కెమెరాను తీసేయడంతో పాటు అక్కడ పెట్టిన ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించారు. మెయిన్ స్టూడియోకు దగ్గర్లోని వాష్ రూంలో ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
అంతేకాకుండా ఈ విషయాన్ని దూరదర్శన్ కేంద్రంలోని మహిళా కమిటీ, డిసిప్లినరీ కమిటీ అధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు.