Karnataka HC on Twitter: ప్రభుత్వాన్ని సవాలు చేసిన ట్విటర్‌కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.50 లక్షల జరిమానా
9 యూనిఫాం రిసోర్స్ లొకేటర్స్ను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ట్విటర్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. ఏదైనా అకౌంట్‌ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లయితే, సంబంధిత ఆదేశాల్లో అందుకు కారణాలను వివరించాలని వాదించింది.

Account Blocking Order: కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేసిన ట్విటర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటీషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అంతే కాకుండా ఆ సంస్థ 50 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విటర్ సంస్థ ఇవ్వలేదని అన్న ధర్మాసనం.. ట్విట్టర్ సంస్థ ఓ సాధారణ వ్యక్తి కాదని, దానికి చట్టం తెలియదని అనడం ఏంటని, అదో బిలియనీర్ కంపెనీయని కోర్టు పేర్కొన్నది.
PM Modi in Metro: ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమానికి మెట్రోలో వెళ్లిన ప్రధాని మోదీ
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత ఏడాది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69-ఏ ప్రకారం ట్విటర్ కంపెనీకి ఆదేశాలు ఇచ్చింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి మధ్యలో ఇచ్చిన ఈ ఆదేశాల్లో కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, ట్వీట్లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. 39 యూనిఫాం రిసోర్స్ లొకేటర్స్ను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ట్విటర్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. ఏదైనా అకౌంట్‌ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లయితే, సంబంధిత ఆదేశాల్లో అందుకు కారణాలను వివరించాలని వాదించింది.
ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 69-ఏ ప్రకారం జారీ చేసిన ఆదేశాలను అవసరమైతే సవాలు చేయడానికి అవకాశం కల్పించే నిబంధన ఉండాలని ట్విటర్ వాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, ట్విటర్ ఇండియా చట్టాలను పాటించడం లేదని, ఇది ఆ కంపెనీకి అనేక సంవత్సరాలుగా అలవాటుగా మారిందని పేర్కొన్నారు. బ్లాకింగ్ ఆర్డర్స్ జారీ చేయడానికి ముందు భారత ప్రభుత్వం, ట్విటర్ ప్రతినిధుల మధ్య దాదాపు 50 సమావేశాలు జరిగాయనిచ దేశంలోని చట్టాలను పాటించకూడదనే ఉద్దేశం ట్విటర్‌కు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని ప్రభుత్వ తరపున న్యాయవాది అన్నారు.
ఇరు వాదనలు విన్న జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం.. ట్విటర్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడానికి కారణాలను తెలియజేయలేదని చెప్తూ, ట్విటర్ కంపెనీకి రూ.50 లక్షలు జరిమానా విధించింది. ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం సమర్ధించింది. ట్వీట్లను, అకౌంట్లను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. ట్విటర్ కంపెనీకి 50 లక్షల రూపాయల జరిమానా విధించిన ధర్మాసనం.. ఈ సొమ్మును 45 రోజుల్లోగా కర్ణాటక రాష్ట్ర న్యాయ సేవల అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.