Hijab Row : హిజబ్ వివాదం.. 58మంది విద్యార్థినులు సస్పెండ్

కర్నాటకలో హిజాబ్‌ వివాదం​ కొనసాగుతోంది. తాజాగా విద్యార్థుల సస్పెన్షన్ కు, కేసుల నమోదుకు దారితీసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హిజాబ్ ధరించి వచ్చిన

Hijab Row : కర్నాటకలో హిజాబ్‌ వివాదం​ కొనసాగుతోంది. తాజాగా విద్యార్థుల సస్పెన్షన్ కు, కేసుల నమోదుకు దారితీసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హిజాబ్ ధరించి వచ్చిన 58 మంది విద్యార్థినులను శివమొగలోని కర్నాటక పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. కర్నాటక పబ్లిక్ స్కూల్ విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చారు. అయితే, వారిని గేటు బయటే నిలిపేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మతపరమైన వస్త్రాలు ధరించి రావొద్దని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది.

Hijab Row: హక్కులను కాలరాస్తున్నారంటూ లెక్చరర్ రాజీనామా

కాగా, తమను కాలేజీలోకి రాకుండా అడ్డుకోవడంపై విద్యార్థులు నిరసన తెలిపారు. హిజాబ్ తమ హక్కు అంటూ నినాదాలు చేశారు. హిజాబ్ లేకుంటే రాలేమన్నారు. స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. 58మందిని సస్పెండ్ చేసింది. కాగా, ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదట నుంచి హిజాబ్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. హిజాబ్‌ తమ హక్కు అంటూ నినదిస్తున్నారు.

Hijab Protests

హిజాబ్ వివాదానికి సంబంధించి కర్నాటక హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. తాము కేసును తేల్చే దాకా మతపరమైన వస్త్రాలు ధరించి స్కూళ్లకు వెళ్లొద్దని విద్యార్థులకు కర్నాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కొంతమంది విద్యార్థులు హిజాబ్‌ ధరించి స్కూళ్లకు వస్తున్నారు. దీనిపై సీరియస్‌ అయిన శివమొగలోని కర్నాటక పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం 58మందిని సస్పెండ్‌ చేసింది. అలాగే హిజాబ్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న కొందరిపై 144 సెక్షన్‌ ఉల్లంఘన కింద శివమొగ పోలీసులు కేసు నమోదు చేశారు.

Hijab Controversy

మరోవైపు ముస్లిం వస్త్రధారణలో హిజాబ్‌ భాగం కాదని కర్నాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. స్కూళ్లల్లో యూనిఫామ్‌ ధరించాలన్న గవర్నమెంట్‌ ఆర్డర్స్‌ రాజ్యాంగంలోని మత స్వేచ్చ, భావప్రకటనా స్వేచ్చకు వ్యతిరేకం కాదని అడ్వకేట్‌ జనరల్‌ వాదించారు. అయితే హిజాబ్‌ ధరించడం ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుందా లేదా అన్నది తేల్చాల్సి ఉందని చీఫ్‌ జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి నేతృత్వంలోని బెంచ్‌ అభిప్రాయపడింది. కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హిజాబ్ వివాదం కర్నాటకలో నిరసనలు, ఆందోళనలు, ఉద్రిక్తతలకు దారి తీసింది.

Hijab Row Case : సమస్యను పెద్దది చేయొద్దు..’హిజాబ్’​ వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

ట్రెండింగ్ వార్తలు