Hijab Row Case : సమస్యను పెద్దది చేయొద్దు..’హిజాబ్’​ వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

'హిజాబ్'​ వివాదాన్ని పెద్దది చేయొద్దని..ఈ 'హిజాబ్'​ వివాదంలో కేసు కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోందని..అక్కడ తీర్పు వచ్చే వరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది.

Hijab Row Case : సమస్యను పెద్దది చేయొద్దు..’హిజాబ్’​ వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

Hijab Row Case

Hijab Row Case: కర్ణాటకలో తీవ్ర వివాదంగా మారి పక్క రాష్ట్రలకే కూడా పాకిన హాజాబ్ వివాదం కేసు విచారణ విషయంలో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు హైకోర్టులో విచారణ కొనసాగుతోందని అక్కడ తీర్పు రానిదే తాము ఈ కేసు గురించి వ్యాఖ్యానించదలచుకోలేదని స్పష్టంచేసింది. హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఈక్రమంలో ఈ సమస్యను పెద్దది చేయవద్దని సూచించింది. హిజాబ్ వివాదం విషయంలో అన్ని అంశాలను గమనిస్తున్నామని..సరైన సమయంలో హిజాబ్ అంశంపై విచారణ చేపడతామని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

Also read : Hizab :హిజాబ్ వివాదంపై పాక్ విమర్శలు..మా సమస్యను మేం చూస్కుంటాం..మీరు నీతులు చెప్పక్కర్లా

కాగా కర్ణాటకు కుదిపేస్తున్న హిజాబ్ అంశంపై విచారణను కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీ చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హిజాబ్‌ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుందని.. ఈ దశలో జోక్యం సరికాదని అభిప్రాయపడింది.హిజాబ్​ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుందన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. కర్ణాటక హైకోర్టు కోరితే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

హిజాబ్ కేసును కర్ణాటక హైకోర్టు నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్.. సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. వివాదం కారణంగా కర్ణాటకలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. విద్యార్థినులపై రాళ్లదాడులు జరుగుతున్నాయని.. వివాదం దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని తెలియజేశారు. ఈ అంశమై సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు కోరడం లేదని కేవలం వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన అభర్థనను పరిశీలిస్తామని సీజేఐ వ్యాఖ్యానించారు.మరోవైపు ఈ వివాదంపై బుధవారం విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రితురాజ్​ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం.. గురువారం మరోమారు విచారించనుంది.

Also read :  Hijab Row: ‘హిజాబ్ తలనే కప్పి ఉంచుతుంది.. బ్రెయిన్‌ను కాదు’

కాగా కర్ణాటకలో విద్యాసంస్థల్లో ముస్లి యువతులు బుర్ఖా వేసుకుని కాలేజీలకు రావటానికి వ్యతిరేకిస్తు వారిని లోపలికి అనుతించటంలేదు.దీంతో ముస్లి యువతులు ఆందోళన చేపట్టారు.వారికి వ్యతిరేకంగా కొంతమంది విద్యార్ధులు కాషాయ కండువాలు వేసుకుని కాలేజీ క్యాంపస్సుల్లో నిరసన చేపట్టారు. ఇదికాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ విషయం భారత్ సరిహద్దుదేశం..మన దాయాది దేశమైన పాకిస్థాన్ వరకు వెళ్లింది. హిజాబ్ విషయంలో పాకిస్థాన్ మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు. ఇటువంటి ఆంక్షలు ముస్లి యువతుల్ని చదువుకు దూరం చేసే కుట్ర అంటూ విమర్శలు చేశారు.

Also read : Asaduddin Owaisi: ‘టోపీతో నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆడపిల్లలు హిజాబ్ తో కాలేజికి వెళ్లకూడదా’

కాగా పాకిస్థాన్ మంత్రులు చేసిన విమర్శలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇది భారతదేశం..మాదేశంలో వచ్చిన ఈ సమస్యను మేమే పరిష్కరించుకుంటాం.ఇది మా సమస్య మేం పరిష్కరించుకుంటాం..ఇది భారతదేశం దేశం..ఇది మా అంతర్గత వ్యవహారం..దీనిపై మీకేమీ సంబంధం లేదు. బాలికల విద్యా హక్కు గురించి మీరా మాకు నీతులు చెప్పేది..బాలికల విద్యను కాలరాసే ఆంక్షలు పెట్టే మీరా మాకు బాలికల విద్య గురించి మాకు పాఠాలు చెప్పేది అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బాలికల విద్యా హక్కు గురించి పోరాడిన మలాలా యూసఫ్ జాయ్ పై పాకిస్థాన్ లోనే దాడి జరిగిందని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు. పాక్ లో జరిగిన దాడి వలనే మలాలా దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

Also read :  Priyanka Gandhi Hijab : బికినీ అయినా, జీన్స్,బుర్ఖా ఏదైనా ధరించే హక్కు మహిళలకు ఉంది