Petrol Prices : దేశంలో రికార్డు స్థాయికి చమురు ధరలు.. రాజస్థాన్‌లో అత్యధికంగా లీటర్ పెట్రోల్‌ రూ.118, డీజిల్‌ రూ.109

పెట్రో మంటలు కొనసాగుతున్నాయి. దేశంలో గతకొద్ది రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనేవున్నాయి. అక్టోబర్ నెలలో 16 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

Petrol

hike petrol and diesel prices : పెట్రో మంటలు కొనసాగుతున్నాయి. దేశంలో గతకొద్ది రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనేవున్నాయి. అక్టోబర్ నెలలో 16 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలో పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌ పై 35 పైసలు, లీటర్ డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌ లో దేశంలోనే అత్యధికంగా లీటర్ పెట్రోల్‌ ధర రూ.118.23, డీజిల్‌ ధర రూ.109.04కు పెరిగింది.

ఢిల్లీలో పెట్రో ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.54కు పెరగగా, డీజిల్‌ ధర రూ.95.27కు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్‌ రూ.112.44, లీటర్ డీజిల్‌ రూ.103.26కు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్‌ రూ.103.61, లీటర్ డీజిల్‌ రూ.99.59కి చేరాయి.

T20 World Cup 2021: రెండో వార్మప్‌లోనూ భారత్‌దే ఘన విజయం

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్‌ రూ.107.12, లీటర్ డీజిల్‌ రూ.98.38కి పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.83, లీటర్ డీజిల్‌ రూ.103.94కు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.