హిందూ సమాజ్ పార్టీ చీఫ్ గొంతుకోసి హత్య

హిందూ మహాసభ చీఫ్ కమలేశ్ తివారీ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. శుక్రవారం లక్నోలో ఈ ఘటన జరిగింది. నగరంలో ఉన్న తన ఆఫీసులోనే హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు స్వీట్స్ తీసుకుని లోపలికి వచ్చారు.
కనిపించకుండా ఆ బాక్సులో పిస్టల్, కత్తి దాచి ఉంచి లోపలికి వెళ్లారు. పార్టీ నాయకుడు వచ్చిన అతిథులకు టీ తాగమని ఆఫర్ చేశాడు. టీ తాగి పదునైన ఆయుధాలతో దాడి చేసి గొంతు కోసి చంపేశారు. ఈ ఘటనలో పదునైన కత్తితో పాటు, స్థానికంగా తయారుచేసిన పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గాయాలతో ఉన్న వ్యక్తిని ట్రామా సెంటర్‌కు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. తివారీ హిందూ సమాజ్ పార్టీకి రాకముందు హిందూ మహాసభలో ఉన్నారు. 2015లో ఇటీవల మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తివారీ.. వార్తల్లో కనిపించాడు.