Hindu religious texts will be taught in schools says Madhya Pradesh CM
CM Shivraj Singh Chouhan : ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా హిందూ మత గ్రంథాలను ప్రవేశపెడతాం అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత, శ్రీరామ చరితం,రామాయణం, మహాభారతం,ఉపనిషత్తులు,నాలుగు వేదాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడతాం అంటూ వ్యాఖ్యానించారు. ఇవి చదివితే మనిషిలో నైతికత పెరుగుతుందని నేటి బాలలే రేపటి పౌరులని భారత దేశ పౌరులకు నైతికత పెంపొందాలంటే హిందూ గ్రంధాలను చదవాలని అన్నారు. హిందూ గ్రంథాలన్నీ చాలా అమూల్యమైనవని… మనిషిని సంపూర్ణ వ్యక్తిగా, నైతికత గల వ్యక్తిగా తీర్చిదిద్దే సామర్థ్యం వీటికి ఉందని చెప్పారు.
ఈ మాటలు నేను ఓ ముఖ్యమంత్రిగా చెబుతున్నానంటూ స్పష్టం చేశారు. ఇతర సబ్జెక్టులతో పాటు హిందూ గ్రంధాలను కూడా ప్రభుత్వం పాఠశాలల్లో మన మత గ్రంథాలన విద్యగా బోధించాల్సిన అవసరం ఉందని ఓ ముఖ్యమంత్రిగా చెబుతున్నానన్నారు. తులసీదాస్ శ్రీరామ చరితం అనే గొప్ప పుస్తకాన్ని రాశారు. అలాంటి గొప్ప పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? దాంట్లో ఉన్న విలువైన విషయాలని పిల్లలను బోధించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంత గొప్ప విలువైన పుస్తకాన్ని మనకు అందించిన తులసీదాస్ కు నేను శిరస్సు వంచి నమస్కరిస్తును అని అన్నారు. అటువంటి మహానుభావులను ఎవరైనా అవమానిస్తే సహించేదిలేదన్నారు. మధ్యప్రదేశ్‌లో మన హిందూ పవిత్ర గ్రంథాలను బోధించడం ద్వారా మన పిల్లల నైతికతను పరిపూర్ణంగా మారుస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.