HMPV Cases : భారత్‌లో పెరుగుతున్న HMPV కేసులు.. 6 కి చేరిన సంఖ్య

HMPV కేసులపై WHO తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

HMPV Cases : భారత్ లో HMPV కేసులు పెరుగుతున్నాయి. హ్యుమన్ మెటా న్యుమో వైరస్ కేసుల సంఖ్య 6 కి చేరింది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ లో HMP వైరస్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగుళూరులో రెండు, తమిళనాడు రాజధాని చెన్నైలో రెండు కేసులు నమోదయ్యాయి. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ఒకటి, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఒక కేసు వెలుగు చూశాయి.

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్ లు..
HMPV కేసులపై WHO తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అటు.. చైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది. చైనాలో ఇన్‌ఫ్లూయెంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, COVID-19తో సహా పలు వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

Also Read : చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ.. ఇది కొత్త వైరస్ కాదా? కోవిడ్-19 పోలి ఉందా? ఏదైనా వ్యాక్సిన్ ఉందా?!

HMPV లక్షణాలు..
* దగ్గు
* ముక్కు కారడం
* గొంతు నొప్పి
* గురక
* శ్వాస ఆడకపోవడం
* దద్దుర్లు

HMPV Virus in China

చిన్న పిల్లలు, వృద్ధులపై ప్రభావం..
భారత్ లో హెచ్ఎంపీ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కాగా, HMPV కొత్తదేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది కరోనా లాంటిది కాదని, మహమ్మారి అయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు. సాధారణంగా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో HMPV సంక్రమిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. ఈ వైరస్ సోకిన 4 నుంచి 7 రోజుల్లో కోలుకుంటారని వివరించారు.

ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి..
చైనాలో వెలుగుచూసిన హెచ్ఎంపీ వైరస్.. క్రమంగా అనేక దేశాలకు విస్తరించింది. భారత్ లో నెలల వయసున్న చిన్నారులు ఈ వైరస్ బారిన పడటం ఆందోళనకు గురి చేసే అంశం. వాళ్లు ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయకపోయినా.. వైరస్ సోకింది. దీన్ని బట్టి ఈ వైరస్ పిల్లల్లో ఎక్కువగా డిటెక్ట్ అవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

Also Read : 2025లో ప్రపంచాన్ని కలవరపెడుతున్న 11 కొత్త రోగాలు ఏంటి? బాబా వంగా, నోస్ట్రడామస్‌ చెప్పిందే నిజం అవుతుందా?