Central Employees : హోలీ అడ్వాన్స్!.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఈ డబ్బులు తీసుకోవడం వల్ల వ్యాపారులు ఊపందుకోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. గత సంవత్సరం కూడా ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Holi Festival Advance : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించనుంది కేంద్ర ప్రభుత్వం. ముందుగానే హోలీ సంబరాలు చేసుకొనే విధంగా ఆ వార్త ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఫెస్టివల్ అడ్వాన్స్ ఇవ్వడం ద్వారా.. ఉద్యోగుల జీవితాలను రంగులమయం చేసుకోవచ్చని భావిస్తోంది. అందులో భాగంగా అడ్వాన్స్ స్కీమ్ ను అందుబాటులోకి కేంద్రం తీసుకొచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కోవిడ్ కారణంగా పరిస్థితిలు ఎంత దారుణంగా మారాయో అందరికీ తెలిసిందే. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు.

Read More : Nawab Malik : డాన్‌తో సంబంధాలు..? మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్

ప్రస్తుతం పరిస్థితిలో మార్పు రావడంతో వ్యాపారాలు మెల్లిమెల్లిగా జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో.. కేంద్ర ఉద్యోగులకు రూ. 10 వేలు అందించాలని, హోలీకి ముందే ఈ డబ్బులను అడ్వాన్స్ రూపంలో తీసుకోవచ్చనే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు తీసుకోవడం వల్ల వ్యాపారులు ఊపందుకోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. గత సంవత్సరం కూడా ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరలా ఈ పథకాన్ని మరలా ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇక కేంద్రం ప్రకటించనట్లుగా భావిస్తున్న ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ లను వాయిదాల మొత్తంలో కట్టవచ్చు. రూ. 10 వేలు అడ్వాన్స్ అకౌంట్ లో జమ అయిన తర్వాత.. ఉద్యోగులు తీసుకున్న మొత్తాన్ని 10 వాయిదాల్లో చెల్లించవచ్చు.

Read More : Super Computer: ఇండియాలోని 9విద్యాసంస్థలకు సూపర్ కంప్యూటర్లు

రూ. 1000 చొప్పున పది నెలల్లో తిరిగి ఇచ్చేలా కేంద్రం వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. ఎలాంటి వడ్డీ ఉండదని సమాచారం. 2020లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ను పునరుద్ధరిస్తున్నట్లు గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు ముందస్తు విలువతో కూడిన రూపే కార్డును అందించిన సంగతి తెలిసిందే. రూపే కార్డు ద్వారా అడ్వాన్స్ ఇవ్వడం వల్ల డిజిటల్ విధానం ప్రోత్సాహించినట్లువుతుందని, ఈ స్కీమ్ పంపిణీకి రూ. 4 వేలు కోట్లు కేటాయించినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు