Nawab Malik : డాన్‌తో సంబంధాలు..? మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్

ఎన్సీపీ సీనియ‌ర్ నేత‌, మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ అరెస్ట్ అయ్యారు. ముంబై బాంబు పేలుళ్ల సూత్ర‌ధారి, అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంతో మనీ లాండరింగ్ కేసులో..

Nawab Malik : డాన్‌తో సంబంధాలు..? మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్

Nawab Malik

Nawab Malik : ఎన్సీపీ సీనియ‌ర్ నేత‌, మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ అరెస్ట్ అయ్యారు. ముంబై బాంబు పేలుళ్ల సూత్ర‌ధారి, అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంతో సంబంధాలున్నాయన్న ఆరోప‌ణ‌లు, మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఆయనను అరెస్ట్ చేసింది. బుధ‌వారం ఉద‌యం న‌వాబ్ మాలిక్ ఇంటికి వెళ్లిన ఈడీ ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆ త‌ర్వాత మాలిక్‌ను త‌మ కార్యాల‌యానికి తీసుకెళ్లిన ఈడీ అధికారులు అక్క‌డే ఆయ‌న‌ను విచారిస్తున్నారు. మ‌రోవైపు న‌వాబ్ మాలిక్ ఇల్లు, కార్యాల‌యాల్లోనూ ఈడీ సోదాలు నిర్వ‌హిస్తోంది.

Nawab Malik : బీజేపీతో పొత్తు వదులుకుంటేనే నితీష్ కు రాష్ట్రపతి అభ్యర్థిత్వం : నవాబ్‌ మాలిక్‌

ED arrests Maharashtra minister and NCP leader Nawab Malik in Money laundering case

ED arrests Maharashtra minister and NCP leader Nawab Malik in Money laundering case

ఉద్ధ‌వ్ థాకరే కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న న‌వాబ్ మాలిక్‌ అరెస్ట్ వ్యవహారం దుమారం రేపింది. ఇటు శివ‌సేన‌తో పాటు, అటు దాని మిత్ర‌ప‌క్షం ఎన్సీపీ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 2024 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత మిమ్మ‌ల్ని మేం విచారిస్తామంటూ కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును ఉద్దేశించి శివ‌సేన ఎంపీ సంజయ్ రౌత్ సంచ‌లన వ్యాఖ్యలు చేశారు. నవాబ్ మాలిక్‌ అరెస్ట్ ను ఖండించిన ఎన్సీపీ… ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలిపింది. దావుద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నలకు నవాబ్ మాలిక్ సహకరించకపోవడంతో అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Enforcement Directorate : మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రిని విచారిస్తున్న ఈడి అధికారులు

దీనిపై నవాబ్ మాలిక్ తీవ్రంగా స్పందించారు. అరెస్ట్ చేసినా భయపడను అన్నారు. పోరాడి గెలుస్తానని చెప్పారు. కాగా, దావూద్ బంధువులతో సంబంధాలపైనా నవాబ్ మాలిక్ ను ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. దావూద్ సోదరుడు ఇబ్రహీం కస్కర్ ను ఇటీవల అరెస్ట్ చేసిన ఈడీ.. కస్కర్ తెలిపిన విషయాల ఆధారంగా నవాబ్ మాలిక్ కు నోటీసులు పంపింది. దావూద్ అనుచరుల కోసం నవాబ్ మాలిక్ ఆస్తులు కొన్నట్లు సమాచారం. నవాబ్ మాలిక్ పలు చోట్ల వివాదాస్పద ఆస్తులు కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ED arrests Maharashtra minister and NCP leader Nawab Malik in Money laundering case

ED arrests Maharashtra minister and NCP leader Nawab Malik in Money laundering case