Nawab Malik : బీజేపీతో పొత్తు వదులుకుంటేనే నితీష్ కు రాష్ట్రపతి అభ్యర్థిత్వం : నవాబ్‌ మాలిక్‌

బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చేంతవరకు నితీశ్ పేరుపై ఎలాంటి చర్చ జరిగే అవకాశాలు లేవని పేర్కొన్నారు. నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు.

Nawab Malik : బీజేపీతో పొత్తు వదులుకుంటేనే నితీష్ కు రాష్ట్రపతి అభ్యర్థిత్వం : నవాబ్‌ మాలిక్‌

Nawab Malik

Nawab Malik key comments : ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ బరిలో దిగనున్నారన్న వార్తలపై నవాబ్‌ మాలిక్‌ స్పందించారు. బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే నితీశ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అభ్యర్థి ఎంపికపై అన్ని పార్టీల నాయకులు చర్చించుకున్న తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందన్నారు. బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చేంతవరకు నితీశ్ పేరుపై ఎలాంటి చర్చ జరిగే అవకాశాలు లేవని పేర్కొన్నారు. నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు. ఆ తర్వాతే ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలా వద్దా అన్న అంశంపై చర్చ ప్రారంభిస్తామని నవాబ్ మాలిక్‌ చెప్పారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలపాలని కాంగ్రెసేతర విపక్షాలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల థర్డ్ ఫ్రంట్ ఆలోచనల్లో ఉన్న ఓ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. పీకే కూడా ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల నితీష్ కుమార్ ప్రశాంత్ కిశోర్‌తో ఢిల్లీలో రహస్యంగా భేటి అయ్యారు. అయితే, అంతుకుముందే నితీష్ కుమార్‌ను రాష్ట్రపతిని చేయాలనే చర్చను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద ప్రశాంత్ కిశోర్ ప్రస్తావించారంట. తెలంగాణా ఎన్నికల్లో పీకే టీమ్ ఈసారి కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ కోసం పని చేస్తుంది. అంతకుముందు ప్రశాంత్ కిశోర్ జగన్ కోసం, స్టాలిన్ కోసం కూడా పనిచేశారు.

Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ సీఎం నితీష్.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం!

ఇక మమతా బెనర్జీ కూడా ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పనిచేశారు. అయితే, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసలు వ్యూహం వెలుగులోకి రానుంది. ఎందుకంటే, బీజేపీకి ప్రస్తుతానికైతే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరినైనా పెట్టుకుని గెలిపించుకునే అవకాశం ఉంది కానీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత బీజేపీ అసలైన వ్యూహం బయటకు వస్తుంది. బీహార్‌లో నితీష్‌ పార్టీ, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఉండగా.. కుల గణన విషయంలో మాత్రం జేడీయూ, బీజేపీ మధ్య పోరు కొనసాగుతోంది. ఈ విషయంలో ఆర్జేడీ నితీష్‌కు అండగా ఉండగా.. తేజస్వి యాదవ్, కేసీఆర్ మధ్య కూడా ఇటీవల ఓ భేటీ జరిగింది. ఈ భేటీలోనూ రాష్ట్రపతి ఎన్నికపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయొచ్చనే అంటున్నారు.

మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని.. “అసలు ఈ విషయంపై తనకు అవగాహనే(సమాచారం అని) లేదని” నితీష్ కుమార్ అన్నారు. మంగళవారం భాగల్పూర్ లో నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశారు. ఫిబ్రవరి 18న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సీఎం నితీష్ కుమార్ ఢిల్లీలో రహస్య భేటీలో పాల్గొన్నారు. ఇరువురు దాదాపు రెండు గంటల పాటు సమావేశం అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి విషమై వీరిరువురు భేటీ అయినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే తమ భేటీలో రాజకీయ అంశాలు చర్చించలేదంటూ భేటీ అనంతరం ఇరువురు ప్రకటించారు.