బడ్జెట్ 2019 : సామాన్యుడు ఏం కోరుకుంటున్నాడు

2019 సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే మిగి ఉంది. ఈ సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పార్లమెంట్ లో చివరి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఫిబ్రవరి-1న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఆయన ప్రవేశపెట్టబోయేది తాత్కాలిక బడ్జెట్ కాదని, సాంప్రయాదానికి స్వస్తి చెబుతూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఇటువంటి సమయంలో సామాన్య వ్యక్తి బడ్జెట్ నుంచి ఏం కోరుకుంటున్నాడో చూద్దాం.
1. కనీస మినహాయింపు పరిమితి పరిమితి 2.5 లక్షల నుంచి 3లక్షలకు
60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగస్థులు ప్రస్థుతమున్న కనీస ట్యాక్స్ మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 3లక్షలకు పెంచాలని కోరుకుంటున్నారు. 60 ఏళ్లకు పైబడిన లేదా 80 కంటే తక్కువ సంవత్సరాల వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్స్ 3.5 లక్షలకు, 80 ఏళ్లకు పైబడిన వెరీ సీనియర్ సిటిజన్స్ కి 5.5 లక్షల వరకు కనీస మినహాయింపు పరిమితి ఉండాలని కోరుకుంటున్నారు.
2. సెక్షన్ 80C పరిమితి పెంపు
పిల్లల ట్యూషన్ ఫీజులు, హౌసింగ్ లోన్ రీపేమెంట్ వంటి వివిధ రకాల చెల్లింపులు, పెట్టుబడులకు సంబంధించి సెక్షన్ 80C మినహాయింపులు అందిస్తోంది. అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం పన్ను తగ్గింపు పరిమితిని 1.5 లక్షల నుంచి లక్షల వరకు తగ్గించుకోవాలని కోరుకుంటున్నారు.
3. 40వేల రూపాయల ప్రామాణిక మినహాయింపు పరిమితిలో పెంపు:
గతేడాది ప్రభుత్వం రవాణా బదులు అలవెన్స్ 19, 200, మెడికల్ రీఎంబర్స్ మెంట్ 15,000 రూపాయలల్లో ప్రమాణిక మినహాయింపు ప్రవేశపెట్టింది. 40వేల రూపాయల ప్రయోజనం చాలా నామమాత్రంగా పెరిగిన కారణంగా ఈ పరిమితిని 70 వేల రూపాయలకు ప్రభుత్వం పెంచాలని కోరుకుంటున్నారు.
4. లీవ్ ట్రావెల్ అలవెన్స్ పై మినహాయింపులు మరిన్ని ఉండాలని కోరుతున్నారు ఉద్యోగులు. నాలుగేళ్లకు కేవలం రెండు లీవ్ ట్రావెల్ అలవెన్స్ కు మాత్రమే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంటుంది. దీన్ని ఏడాదికి ఒకటి అయినా చేయాలని కోరుతున్నారు పన్ను చెల్లింపుదారులు. దీనిపై ఇప్పటికే ఐటీ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక శాఖకు రిక్వెస్ట్ లు వెళుతున్నాయి. రెండింటికి అదనంగా ఒకటి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.
5. డే కేర్ ఫీజులపై రాయితీలు :
ప్రస్తుతం డే కేర్(పగటి పూట పిల్లలను సంరక్షించే కేంద్రాలు) లకు వెచ్చించే వ్యయానికి మినహాయింపులకు అందించే నియమం చట్టం కింద లేదు. నేటి రోజుల్లో ఎక్కువ మంది భారతీయ భార్యా, భర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళుతుండటం వల్ల వారి పిల్లలను డే కేర్ పెంటర్ లలో వదిలి వెళుతున్నారు. అదేవిధంగా మంచి సౌకర్యాలు అందించే డే కేర్ సెంటర్లపై వర్కింగ్ పేరెంట్స్ ఆధారపడాల్సి వస్తోంది. డే కేర్ సౌకర్యాలు ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పటి వరకు డే కేర్ సెంటర్లకు ఖర్చు చేసే మొత్తానికి పన్ను మినహాయింపులు లేవు. ఈ బడ్జెట్ లో కొత్తగా రాయితీలు ఇవ్వాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం.
6. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వారికి మొదటి ఏడాది 2 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంది. ఈ రాయితీని 3 లక్షల రూపాయలకు పెంచాలని ఆర్థిక శాఖ ఆలోచిస్తోంది.