‘కరోనా టెస్టు చేసుకున్నాకే చికిత్సకు రండి’… యూపీలో ముస్లింలపై హాస్పిటల్ యాజమాన్యం వివక్ష

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ హాస్పిటల్ యాజమాన్యం  నిర్వాకం బయటపడింది. ఓ సామాజికవర్గంపై మత వివక్ష చూపింది.

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 09:52 AM IST
‘కరోనా టెస్టు చేసుకున్నాకే చికిత్సకు రండి’… యూపీలో ముస్లింలపై హాస్పిటల్ యాజమాన్యం వివక్ష

Updated On : April 20, 2020 / 9:52 AM IST

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ హాస్పిటల్ యాజమాన్యం  నిర్వాకం బయటపడింది. ఓ సామాజికవర్గంపై మత వివక్ష చూపింది.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ హాస్పిటల్ యాజమాన్యం  నిర్వాకం బయటపడింది. ఓ సామాజికవర్గంపై మత వివక్ష చూపింది. మీరట్ లోని వ్యాలెంటిస్ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం రోగులు, వారి కేర్ టేకర్లకు షరతు విధించింది. కొత్తగా హాస్పిటల్ కు చికిత్స కోసం వచ్చే ముస్లిం రోగులు ముందుగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, పరీక్షల్లో నెగెటివ్ గా తేలితేనే ఆస్పత్రికి రావాలని కండీషన్ పెట్టింది. అంతేకాకుండా పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చారు.

దీంతో హాస్పిటల్ యాజమాన్యం తీరుపై ముస్లిం సామాజిక వర్గంతోపాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు చికిత్స అందించడంలో మతవివక్ష చూపడం మంచిది కాదన్నారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యం తప్పును ఒప్పుకుంది. ఒక వర్గం ప్రజల పట్ల వివక్షచూపినట్లుగా న్యూస్ పేపర్లలో ప్రకటన ఇచ్చినందుకు క్షమాపణలు కోరింది.