Ants find Gold: చీమలు చెప్పిన బంగారు గని రహస్యం: బీహార్‌లో బంగారం ఎలా బయటపడింది

అయితే 40 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఆధారంగా జముయ్ లో బంగారు గని బయటపడింది. అదీ చీమల ద్వారా.

Ants find Gold: బీహార్ రాష్ట్రంలోని జముయ్ జిల్లాలో బంగారు గని తవ్వకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జముయ్ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 222.88 మిలియన్ టన్నుల బంగారు నిల్వలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) తేల్చింది. బీహార్ లో బంగారం నిల్వలపై కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి సైతం గతేడాది లోక్ సభలో వ్రాతపూర్వక సమాధాం ఇచ్చారు. ఈక్రమంలో బీహార్ లో బంగారు గని తవ్వకాల నిమిత్తం బిహార్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఆధ్వర్యంలో బంగారం తవ్వే సంస్థలతో చర్చలు జరుపుతుంది బీహార్ ప్రభుత్వం. జీఎస్ఐ సర్వే ప్రకారం జముయ్ జిల్లాలోని కర్మాటియా, ఝాఝా, సోనో ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయి. అయితే మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న జముయ్ జిల్లాలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గత 40 ఏళ్లలో ఎవరూ నిర్ధారించలేకపోయారు.

other stories: Pakistan Drone Magnetic Bombs : టార్గెట్ అమర్‌నాథ్ యాత్ర..! పాకిస్తాన్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

40 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఆధారంగా జముయ్ లో బంగారు గని బయటపడింది. అదీ చీమల ద్వారా. అవును మీరు చదివింది నిజమే..జముయ్ జిల్లాలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు చీమల ద్వారా తెలిసింది. జముయ్ జిల్లా ప్రజల కధనం ప్రకారం..40 ఏళ్ల క్రితం జముయ్ లోని ఓ ప్రాంతంలో పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఎండా కాలంలో చీమలు..వేడి తట్టుకునేందుకు ఆ మర్రి చెట్టు వద్ద పెద్ద పుట్టలు పెట్టాయి. అయితే చీమలు ఆ పుట్ట కోసం మట్టిని చెట్టు కింద నుంచి తెస్తుండడం గమనించారు స్థానికులు. పుట్టమట్టిని పరీక్షించగా..అందులో తళతళలాడే కణాలు బయటపడ్డాయి. ఈ విషయం అప్పటికి స్థానికుల మధ్యే ఉండగా..అనంతరం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన జియోలాజికల్ సర్వే అధికారులు..జముయ్ జిల్లాలో పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇండియాలో ఇప్పటి వరకు బయటపడ్డ భారీ బంగారు నిక్షేపాలు కర్ణాటకలోని కోలార్ లో ఉన్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గా పిలిచే ఈ బంగారు గనులను 2001లో కర్ణాటక ప్రభుత్వం మూసివేసింది.

other stories: Wheat Exports: గోధుమల దిగుమతి కోసం భారత్‌ను సంప్రదిస్తున్న అనేక దేశాలు

ట్రెండింగ్ వార్తలు